75 మందితో టీటీడీ కొత్త పాలక మండలి! 

Publish Date:Sep 14, 2021

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి ఖరారైందని తెలుస్తోంది. మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే టీటీడీ పాలకమండలిని ఖరారు చేశారని సమాచారం. ఈసారి 75 మందితో పాలకమండలి కొలువు దీరబోతోందని తెలుస్తోంది. ఇందులో 25 మంది టీటీడీ బోర్డు మెంబర్లు కాగా.. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మందిని నియమించనున్నారు. టీటీడీ కొత్త పాలక మండలిపై ఒకటి, రెండు రోజుల్లోనే జీవో వచ్చే అవకాశం ఉంది.

టీటీడీ నిబంధనల మేరకు ఛైర్మన్ తో సహా 25 మంది సభ్యులతో పాలక మండలి ఉండాలి. అయితే కేంద్రంలోని పెద్దల మొదలు పలు పార్టీలు..అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రలు మొదలు అనేక మంది ప్రముఖులు తమ వారిని ఈ బోర్డులో అవకాశం కల్పించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు సిఫార్సు చేశారు.  వారిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు..తమిళనాడు సీఎం వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఊహించని స్థాయిలో వచ్చిన సిఫార్సులు.. ఒత్తిడి కారణంగా భారీ స్థాయిలో ఆశావాహులు ఉండటంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా నిబంధనల ప్రకారం 25 మందితో బోర్డు సభ్యులు..మరో 50 మందిని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. 

25 మంది టీటీడీ బోర్డు మెంబర్లలో సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ప్రతి బోర్డులోనూ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అవకాశం కల్పిస్తారు. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురికి అవకాశం దక్కిందని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక నుండి కూడ ముగ్గురు చొప్పున.. ఢిల్లి నుండి ఒక మంత్రి గారి భార్యకు చోటు దక్కిందని సమాచారం. ఇక కేంద్రం పెద్దలు చెప్పిన మరొక నలుగురికి టీటీడీ బోర్డులో స్థానం దక్కిందని తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం నుంచి ఒకరికి ఛాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతోంది. శారద పీఠం స్వామి చెప్పిన ఇద్దరు ఉండనున్నారు. 

గత పాలక మండలిలో సభ్యులుగా ఉన్న సుధా నారయణ మూర్తి, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు, తెలంగాణ నుంచి ప్రతాప రెడ్డి కి అవకాశం ఖాయమని తెలుస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నుంచి ఒకరికి ఈ పాలక మండలిలో స్థానం ఖాయం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి గుజరాత్ కు చెందిన ఒకరికి సైతం బోర్డు సభ్యుడుగా నియమితులు అవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు ఒక్కక్కరూ పలువురి పేర్లు సిఫార్సు చేసారు. సినీ పరిశ్రమ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. 

గత పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ సారి సైతం అదే హోదాలో కొనసాగనున్నారు. తిరుపతి స్థానిక ఎమ్మెల్యేగా భూమన..తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డికి ఈ అవకాశం దక్కనుంది. అదే విధంగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న విశాఖకు చెందిన సుధాకర్ సైతం ఈ సారి ఎక్స్ అఫీషియో కోటాలో బోర్డు సభ్యుడుగా ఉండనున్నారు. 

By
en-us Political News

  
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.