టీఎస్పీఎస్సీ లీకేజీ.. ఈడీ వర్సెస్‌ సిట్‌!

Publish Date:Apr 14, 2023

Advertisement

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.  ఈ కేసును సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల లీకేజీలో    మనీల్యాండరింగ్‌ ద్వారా భారీగా సొమ్ములు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో కేసు దర్యాప్తును  కూడా  చేపట్టింది. దీంతో ఈడీ వర్సెస్‌ సిట్‌గా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో చెప్పినట్లు కేంద్రం చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. రాష్ట్రం చేతిలో సిట్ ఉంది అన్నట్లుగానే ఈ దర్యాప్తు సంస్థల తీరు కూడా ఉంది.

తాజాగా  తమ దర్యాప్తునకు సిట్‌ సహకరించడంలేదని ఈడీ ఆరోపిస్తోంది. తమకు విచారణకు సంబంధించి సిట్  ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ రెండు దర్యాప్తు సంస్థల పంచాయతీ కోర్టుకు చేరింది. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ..  వివరాలు ఇవ్వాల్సిందిగా మార్చి 23న సిట్ కు లేఖ రాసింది. ముందు నుంచి సిట్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తుండటంతో పేపర్‌ లీకేజీకు సంబంధించిన 8 డాక్యుమెంట్లను ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. అయితే ఇప్పటి వరకూ కూడా ఈడీ లేఖకు సిట్‌ అధికారులు  స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది.

టీఎస్సీఎస్పీ పేపర్‌ లీకేజీ కేసులో అడిగిన సమాచారాన్ని తమకు ఇవ్వడంలేదంటూ ఈడీ   పిటిషన్  దాఖలు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ  అందుకు సిట్‌ ఇచ్చే సమాచారం తమకు ఉపయోగపడుతుందని అంటోంది. అందుకే కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరింది. ఇదిలా ఉంటే ఈడీ పిటిషన్‌పై సిట్‌ కూడా కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తు కీలక దశలో ఉండడంతో వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ తన కౌంటర్ లో పేర్కొంది.ఈ పిటిషన్లపై  విచారణ జరగనుంది.
పేపర్‌ లీక్‌ కేసులో ఈడీ ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపైనే దృష్టి పెట్టింది. పబ్లిక్‌ డొమైన్‌ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి ఈసీఐఆర్‌ నమోదు చేసింది.

భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌ల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా   నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. టీఎస్సీఎస్పీ నిందితుల నుంచి సిట్‌ ఏడు లక్షలు సేకరించింది. రూ.40 లక్షలు లావాదేవీలు జరిగినట్లు ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్‌ పేర్కొన్నది. కేసు వ్యవహారం రానున్ను రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. 

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.