అక్టోబర్ లోనే స్థానిక ఎన్నికలు: క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేష్.!

Publish Date:Sep 23, 2026

Advertisement

ఏపీ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.  రాష్ట్ర రాజకీయాలలో స్థానిక ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.  ఎన్నికలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదనీ..  ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదని  తేల్చిచెప్పారు.

మంత్రులు,  పార్టీ కీలక నేతల ఉన్నతస్థాయి భేటీలో నారా లోకేశ్  స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. , క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి   స్థానిక ఎన్నికలు  కీలకమన్న నారా లోకేష్.. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా,  పారదర్శకమైన పాలనను అందిస్తూ ప్రజల మధ్యే ఉంటున్న కూటమి శ్రేణులు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

కేవలం విజయం సాధించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.   


[Nara Lokesh, AP local body elections, Panchayat elections,  Andhra Pradesh, TDP alliance clean sweep, AP politics,Telugu One]

By
en-us Political News

  
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.