ఉగ్ర దేశాల జాబితా నుండి సిరియాను తొలగించిన ట్రంప్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఉగ్రదేశాల జాబితానుంచి సిరియాను తొలగించారు.  దీర్ఘ కాలంగా   తీవ్ర ఆంక్షలతో నలిగిపోతున్న సిరియా దేశానికి  అగ్రరాజ్యాధినేత  ఉపశమనాన్ని ప్రకటించారు. ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశాల  బ్లాక్‌లిస్ట్ జాబితా నుండి సిరియాను అధికారికంగా తొలగించాలని ట్రంప్ నిర్ణయించారు. దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజంలో ఒంటరైపోయిన డమాస్కస్‌తో దౌత్య సంబంధాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి..  యుద్ధంతో  కుదేలైన ఆ దేశ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడానికి ట్రాంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.  

ఇందుకు సంబంధించిన 45 రోజుల ముందస్తు నోటీసు వ్యవధి ప్రక్రియను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్‌కు సమర్పించారు. సిరియా ప్రజలు దశాబ్దాల చీకటి నుండి విముక్తి పొంది, ఉన్నత స్థానానికి ఎదగడానికి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్ననిర్ణయమిదని చెప్పారు.  

నాటో సదస్సు సందర్భంగా బుధవారం (జులై 8) అంకారాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ముఖాముఖి  సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన వెంటనే ట్రంప్ స్వయంగా అల్-షరాకు అందించిన  లేఖలో  మీ దేశ పునర్నిర్మాణానికి, పురోభివృద్ధికి అడ్డుగా ఉన్న అన్ని రకాల అడ్డంకులను పూర్తిగా తొలగిస్తానని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు.  సిరియా గడ్డపై భారీగా పెట్టుబడులు పెట్టడానికి..   దేశాన్ని ఆర్థికంగా   సంపన్నంగా మార్చడానికి  అమెరికా కంపెనీలు  పూర్తి సన్నద్ధతతో సిద్ధంగా ఉన్నాయంటూ..  ట్రంప్ ఆ లేఖలో స్పష్టమైన భరోసా ఇచ్చారు. 

Syria terrorist list removal, Donald Trump Syria decision, Syria economic sanctions lifted

By
en-us Political News

  
మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ ఇంధన భద్రత, వ్యవసాయ రంగం, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రధాని
ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా డా. నరేంద్రకుమార్‌ నియామకం..!
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం
తెలంగాణలోని ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
చనిపోయిందని వైద్యులు తేల్చేస్తే.. రోడ్డు గుంత ప్రాణం పోసింది..!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసంరి లయన్స్.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఏలూరు జిల్లా పరిధిలోని బొగ్గు గనుల బ్లాకులను రిలయన్స్ దక్కించుకోవడంతో ఇంకే మాత్రం జాగు లేకుండా ఈ బిగ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.