సముద్ర జలాల నుంచి విద్యుత్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

టెక్నాలజీ ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని తరచుగా విస్మయానికి గురి చేస్తూ ఉండే జపాన్.. ఇప్పుడు ఇంధన రంగంలో మరో ఆవిష్కరణకు తెరలేపింది.  నదులు వచ్చి సముద్రంలో కలిసే ప్రతిసారీ, మంచినీరు, ఉప్పునీరు మిళితమయ్యే క్రమంలో కొంత శక్తి నిశ్శబ్దంగా వృథా అవుతుంటుంది. ఈ సహజ సిద్ధమైన ప్రక్రియను ఎవరూ ఊహించని రీతిలో ఒడిసిపట్టి..  ఏకంగా సముద్రపు ఉప్పునీటి నుండి కరెంట్ తయారు చేసే సరికొత్త సాంకేతికతను జపాన్ శాస్త్రవేత్తలు సక్సస్ ఫుల్ గా ఆవిష్కరించారు. జపాన్‌లోని తీరప్రాంత నగరం ఫుకుయోకాలోని  మామిజుపియా డీశాలినేషన్ కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి ఒస్మోటిక్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి జపాన్ ఇంధన రంగంలో వినూత్న విప్లవానికి నాంది పలికింది.  డెన్మార్క్  తర్వాత ప్రపంచంలోనే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడుస్తున్న రెండో ప్లాంట్ ఇదే కావడం విశేషం. సాధారణంగా నగరాలు వదిలేసే అత్యధిక ఉప్పు సాంద్రత కలిగిన వ్యర్థ నీరు, మురుగునీటి ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని ఉపయోగించి ఈ ప్లాంట్ లో  విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

ఈ విప్లవాత్మక ప్లాంట్ సైన్స్ లోని  ఒస్మోసిస్ అంటే ద్రవాభిసరణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దీనిని శాస్త్రీయంగా  ప్రెజర్ రిటార్డెడ్ ఒస్మోసిస్ అంటారు. ఈ ప్రక్రియలో అత్యధిక ఒత్తిడితో కూడిన ఉప్పునీటి వైపుకు మంచినీరు అత్యంత వేగంగా దూసుకురావడం వల్ల అక్కడ నీటి పరిమాణంతో పాటు ప్రవాహ ఒత్తిడి అనూహ్యంగా  పెరుగుతుంది. ఈ తీవ్రమైన నీటి ప్రవాహ ఒత్తిడిని ఉపయోగించి భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతారు, ఆ తర్వాత దానికి అనుసంధానించిన జనరేటర్ సహాయంతో కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం ప్రయోగంలో ఎలాంటి సాంప్రదాయ ఇంధనాన్ని వాడకపోవడం, అలాగే పర్యావరణానికి హాని చేసే కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు   విడుదల కాకపోవడం విశేషం.  

 సాధారణ సముద్రపు నీటిలో 3.5 శాతం మాత్రమే ఉప్పు ఉంటే, ఈ డీశాలినేషన్ కేంద్రంలో మంచినీటిని వేరు చేసిన తర్వాత మిగిలే వ్యర్థ   నీటిలో ఏకంగా 8 శాతం అత్యధిక ఉప్పు సాంద్రత ఉంటుంది. మరోవైపు మంచినీటి విభాగంలో మురుగునీటి ప్లాంట్ నుంచి సేకరించిన శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. ఈ రెండు రకాల నీళ్ల మధ్య ఉప్పు సాంద్రత తేడా ఎంత ఎక్కువగా ఉంటే, నీటి ప్రవాహ ఒత్తిడి అంత బలంగా మారి అంత ఎక్కువ విద్యుత్ జనరేట్ అవుతుంది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ ప్లాంట్ ఏడాదికి ఏకంగా 8 లక్షల 80 వేల కిలోవాట్ అవర్ల విద్యుత్‌ను  ఉత్పత్తి చేస్తోంది. ఈ కరెంట్ దాదాపు 300 జపనీస్ కుటుంబాల వార్షిక గృహ అవసరాలకు సరిపోతుంది.

మనం సాధారణంగా చూసే సౌరశక్తి, పవన విద్యుత్ లాంటి పునరుత్పాదక ఇంధన వనరులకు వాతావరణ పరిస్థితులతో సంబంధం ఉంటుంది. ఎండ లేకపోయినా, గాలి వీచకపోయినా వాటి ఉత్పత్తి నిలిచిపోతుంది. కానీ, జపాన్ కనిపెట్టిన ఈ సరికొత్త పవర్ ప్లాంట్ వాతావరణ మార్పులతో   సంబంధం లేకుండా, ఏకధాటిగా 90 శాతం గరిష్ట సామర్థ్యంతో రోజుకు 24 గంటలూ నిరంతరాయంగా క్లీన్ ఎనర్జీని అందిస్తుంది. ఫిల్టర్లు త్వరగా పూడుకుపోవడం వంటి కొన్ని చిన్న చిన్న సాంకేతిక సవాళ్లు   ఎదురవుతున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా నదీ ముఖద్వారాల వద్ద ఈ  బ్లూ ఎనర్జీ ని   భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు జపాన్ చేసిన ఈ అద్భుత ప్రయోగం ఒక దిక్సూచిలా నిలుస్తుంది. 

japan osmotic power plant, saltwater electricity generation, blue energy technology

By
en-us Political News

  
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.