సహనం కోల్పోయిన ట్రంప్.. ఇరాన్‌పై బూతుల వర్షం

Publish Date:Apr 5, 2026

Advertisement

హోర్ముజ్ జలసంధి తెరిచే విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గుతున్నట్టు కనిపించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో అసహనం  కట్టలు తెంచుకుంది. ట్రంప్ ఆదివారం(ఏప్రిల్ 5) సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోయారు. హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌ను ఇష్టారీతిన తిడుతూ నెట్టింట పోస్టు పెట్టారు. మంగళవారం (ఏప్రిల్ 7) నుంచీ ఇరాన్‌‌లో నరకం తప్పదని హెచ్చరించారు.

మునుపెన్నడూ చూడని స్థాయిలో పరిస్థితి దిగజారుతుందని హెచ్చరించారు.  మంగళవారం(ఏప్రిల్ 7)  పవర్ ప్లాంట్స్‌పై దాడులు, బ్రిడ్జ్‌పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు. అమెరికా డెడ్‌లైన్‌ను ఇరాన్ ఖాతరు చేయకపోతుండటంతో ట్రంప్ నోటికొచ్చినట్టు తిడుతూ సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు పైలట్‌లను అమెరికా సైన్యం తాజాగా కాపాడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మునుపటి డెడ్‌లైన్‌ను మరోసారి గుర్తు చేశారు.

మరోవైపు..  ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై ఇరాన్   ఘాటుగా స్పందించింది. ఇరాన్‌లో మౌలిక వసతులపై దాడులు జరిగితే అమెరికాకు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ జనరల్ అలీ అబ్దుల్లాహీ ఆలియాబాదీ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ మిలిటరీ స్థావరాలు అన్నిటినీ టార్గెట్ చేస్తామని హెచ్చరించారు.

By
en-us Political News

  
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.