యుద్ధ వ్యూహాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ తంత్రాలలో కూడా ఏఐ ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఈ విషయంలో చైనా రెండడుగులు ముందే ఉంది. అమెరికా సైనిక బలగాల కదలికలు, వారి మోహరింపులను పసిగట్టేందుకు చైనా ఏఐని సాధనం మలుచుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా మిలిటరీ రహస్యాలను ఛేదించేందుకు చైనా ఏఐని వినియోగిస్తోంది.
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్‌విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్ఐఎన్టి) ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి. ఈ డేటా విశ్లేషణ ద్వారా అమెరికా అత్యంత రహస్యంగా భావించే ఆపరేషన్లను కూడాచైనా పసిగట్టగలుగుతోంది.
చైనా ప్రభుత్వం చేపట్టిన మిలిటరీ-సివిల్ ఫ్యూజన్ విధానం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పౌర అవసరాల కోసం పనిచేసే సంస్థలను కూడా చైనా సైనిక ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా కంపెనీలు ఏఐ సహాయంతో అమెరికా రక్షణ కవచాలను ఛేదిస్తున్నాయి. దీనివల్ల ఇకపై యుద్ధరంగంలో ఏదీ రహస్యం కాదని, స్టీల్త్ టెక్నాలజీకి కాలం చెల్లిందని చైనా సంస్థలు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుతున్నాయి.
ఈ పరిణామాలు అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అండతో నడిచే ఈ సంస్థలు తమ సైనికులకు ప్రత్యక్ష ముప్పుగా మారాయని అమెరికా హౌస్ సెలెక్ట్ కమిటీ పేర్కొంది. గతంలో ఈ ఏఐ నిఘా ద్వారా చైనా గుర్తించిన కొన్ని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టెక్నాలజీ సాయంతో అమెరికా రక్షణ వ్యవస్థలోని లొసుగులను చైనా బహిర్గతం చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండానే అగ్రరాజ్యం అమెరికాను వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు ఏఐని చైనా ఒక శక్తివంతమైన నిఘా సాధనంగా మార్చుకుంది. రాబోయే రోజుల్లో ఏఐ యుద్ధతంత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/challenge-to-us-defense-system-via-ai-36-216732.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.