కొరివితో తల గోక్కున్న కేసీఆర్

Publish Date:Jun 11, 2015

Advertisement



తెలుగుదేశం పార్టీని అప్రతిష్ఠపాలు చేసి రాజకీయంగా లాభం పొందాలని అనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొరివితో తల గోక్కున్నారా? తెలుగుదేశం నాయకులను కేసులలో ఇరికించే విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ప్రభుత్వం తాను తీసిన గోతిలో తానే పడిందా? చెరపకురా చెడేవు అనే సామెతకు టీఆర్ఎస్ మరో ఉదాహరణగా నిలవబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారి నుంచి వస్తోంది. కేసీఆర్ చాలా తెలివైన వారని, తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టగల నేర్పరి అని మొన్నటి వరకూ అనుకున్నవారు కూడా ఇప్పుడు కేసీఆర్ ఇరుక్కుపోయిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. ఎరక్కపోయి ఇరుక్కపోవడం కాకుండా... అన్నీ ఎరిగిన వ్యక్తి ఇలా అడ్డంగా ఇరుక్కుపోవడం చాలా వెరైటీగా వుంది.  ఓటుకు నోటు వ్యవహారంలో ఏ కోణంలో చూసినా తెలుగుదేశం పార్టీకి గానీ,  ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు గానీ ఎలాంటి నష్టం జరిగే దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ వ్యవహారంలో చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన అధికార పార్టీ మాత్రం అన్నిరకాలుగా ఇరుక్కుపోయింది. మొన్నటి వరకూ మాదే పైచేయి అన్నట్టుగా వున్న అధికార టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అయితే వారి అత్యుత్సాహం కారణంగా జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది.

కేసులు పెట్టి చంద్రబాబును ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన టీఆర్ఎస్ ఇప్పుడు తానే ఇరుకున పడింది. రేవంత్ మీద జరిపిన స్టింగ్ ఆపరేషన్‌కి న్యాయస్థానాల్లో విలువ లేదని పలువురు న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. స్టింగ్ ఆపరేషన్లకి వ్యతిరేకంగా గతంలో సుప్రీం కోర్టును ఇచ్చిన తీర్పును కూడా వారు ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తిని లంచం ఇచ్చేలా ప్రేరేపించి, ఆ వ్యవహారాన్ని చిత్రీకరించి, అతన్ని దోషిగా న్యాయస్థానాల ముందు నిలబెట్టడం అనేది నిష్ప్రయోజనం అనేది స్పష్టంగా వుంది.  అలాగే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన సంభాషణ అన్నట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ మీడియా ప్రచారం చేస్తున్న ఆడియో టేపులకు కూడా ఎంతమాత్రం విలువలేదు.  అసలు  ఆ టేపుల్లో ఉన్న సంభాషణలో కొంపలు మునిగిపోయే అంశమే లేదు. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం మెడకే పాములా చుట్టుకుంది. ట్యాపింగ్ వ్యవహారం గతంలో ప్రభుత్వాలనే కూల్చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం శాఖతోగానీ, టెలికం శాఖతోగానీ విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం ‘‘మేం ఏపీ సీఎం సంభాషణలను రికార్డ్ చేశాం’’ అని సగర్వంగా ప్రకటించుకున్న టీఆర్ఎస్‌కి వెన్నులో చలి పుట్టిస్తోంది.

తెలుగుదేశం పార్టీ విషయంలో టీఆర్ఎస్ చేసిన యాక్షన్‌కి ఇప్పుడు భారీ రియాక్షన్ వస్తోంది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో తమకు రక్షణ లేని పరిస్థితి వుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. విభజన చట్టంలో వున్న సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పోలీసు, శాంతిభద్రతల అంశాలు గవర్నర్‌కి అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  సంవత్సర కాలంగా ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో వుంది. ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్‌ని గవర్నర్ చేతిలో పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అదే జరిగితే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శరాఘాతం తగిలినట్టే. రాజధానిలో కీలకమైన అంశాలు గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో చేయగలిగిందే ఏమీ వుండదు. ఈ ఏడాది చివర్లో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతూ, ఏ అవకాశాన్నీ వదలకుండా వినియోగించుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఆయువుపట్టు మీద దెబ్బలా మారే ప్రమాదం వుంది.

తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ చంద్రబాబు విషయంలో చాలా సానుకూలంగా వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చంద్రబాబుకు అండగా నిలిచే అవకాశాలు నూటికి నూరుశాతం వుంది. కేంద్ర ప్రభుత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన స్నేహధర్మాన్ని విడిచిపెట్టని చంద్రబాబు మీద కేంద్రానికి గౌరవం వుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం చంద్రబాబును ఆదుకోవడానికి ముందుకు రావడం అనేది సహజ పరిణామం. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు కోరినట్టుగా హైదరాబాద్‌ అధికారాలను గవర్నర్‌కి అప్పజెప్పడం అనేది బీజేపీకి కూడా ఉపయోగపడే అంశం. తన రాజకీయ ప్రత్యర్థులైన టీఆర్ఎస్, మజ్లిస్‌లను ఒకేసారి దెబ్బతీయడానికి దీనిద్వారా మేలు జరుగుతుంది. గవర్నర్‌కి అధికారాలు అప్పగించడంతోపాటు ఇప్పుడున్న గవర్నర్‌ నరసింహన్‌ని తొలగించి, తమకు అనుకూలంగా వున్న గవర్నర్‌ని కేంద్రం నియమించిందంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్, మజ్లిస్ కూటమి చేతులు ఎత్తేయడం మినహా చేయగలిగిందేమీ వుండదు. రాజధానిలోనే టీఆర్ఎస్ తన పట్టును పూర్తిగా కోల్పోయిందంటే, ఒక విధంగా అది ఆ పార్టీ పతనానికి మొదటి మెట్టు అయ్యే ప్రమాదం వుంది. మరి ఇలాంటి పరిస్థితిలోకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరైనా నెట్టారా? దీన్నే స్వయంకృతాపరాధం అంటారు. ఆ అపరాధానికి ఏ స్థాయిలో మూల్యం చెల్లిస్తారనేది వేచి చూడాల్సిన విషయం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.