సోషల్ మీడియాలో కిషన్ రెడ్డిపై భారీ ట్రోలింగ్.. అసలు కథ ఇదే

Publish Date:Feb 7, 2022

Advertisement

బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏనాడూ వివాదాల జోలికి వెళ్లలేదు. వివాదాస్పద కామెంట్లు చేయలేదు. బండి సంజయ్, అర్వింద్ లాగా ముస్లింల ప్రస్తావన కూడా ఏనాడూ తీసుకొచ్చిన దాఖలాల్లేవు. పైగా ఎంఐఎం నేతలతో తెరచాటుగా అంటకాగుతాడన్న పేరున్న నాయకుడు కూడా ఆయనే. ఎంఐఎం నేతలతో చాలా ఆత్మీయంగా మెలగడం మీడియా సాక్షిగా చాలాసార్లు కంటపడింది కూడా. 

అలాంటి కిషన్ రెడ్డి హఠాత్తుగా అక్బరుద్దీన్ ఆనాడు వాడిన 15 నిమిషాల డైలాగ్ ను ఎత్తుకున్నారు. ట్విట్టర్లో తన ఒపీనియన్ షేర్ చేశారు. ఇహ చూస్కోండి.. నా సామిరంగా.. మొన్న ముచ్చింతల్ కు ప్రధాని వచ్చిన రోజు 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' అంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన క్యాంపెయిన్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ లోకి వెళ్లినట్టే... అదే స్థాయిలో కిషన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.  తానేదో ఆశించి ఆ కామెంట్లను ఎత్తుకొని అనవసరంగా తొందరపడ్డానా అని కిషన్ రెడ్డి భావించేంతగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ఎంపీ అర్వింద్ ను సైతం వదల్లేదు. 

ఇంతకీ కిషన్ రెడ్డి ఆ 15 నిమిషాల అంశాన్ని ఎందుకు కెలికారంటే... సమానత్వం తెలియని దేశ ప్రధాని... సమతా విగ్రహాన్ని ఆవిష్కరించడమే విడ్డూరంగా ఉందని కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. తమను పోలీసులు 15 నిమిషాలు వదిలేస్తే 100 కోట్లున్న హిందువులు బలవంతులా... 15 కోట్లున్న ముస్లింలు బలవంతులా తేలిపోతుందంటూ అక్బరుద్దీన్ విపరీత స్థాయిలో చేసిన రెచ్చగొట్టే కామెంట్లను ఉటంకిస్తూ... అలాంటి కామెంట్లు చేసే ఎంఐఎం నేతలను సీఎం కేసీఆర్, కేటీఆర్ వెనకేసుకొస్తారని, వాళ్లతోనే అంటకాగుతారని, ఎందరో హిందువులను రజాకార్ల చేత ఊచకోత కోయించిన నిజాం వారసులకే కొమ్ము కాస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.

దానికి రీకౌంటర్ గా టీఆర్ఎస్ సోషల్ మీడియా ఫోరం.. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా... అరెస్టు చేయవచ్చు కదా. మీ అధికారాన్ని మీకే ఒకరు గుర్తు చేయాలా.. వెళ్లి అరెస్టు చేయండి.. అంటూ సవాళ్లు రువ్వుతున్నారు. మరొకరు... అసలు అసదుద్దీన్ ఫ్యామిలీ లాయర్ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావేనని, ఆయనకు అనేక కేసుల్లో బెయిల్ తీసుకొచ్చేది ఆయనేనంటూ రెచ్చగొడుతున్నారు. కేసీఆర్ ఏదైనా బహిరంగ సభకు వెళ్లేటప్పుడు దట్టీ కట్టుకోవడం అలవాటు. ముస్లింల ఓట్ల కోసమే దట్టీ కట్టుకుంటాడన్న అర్వింద్ కామెంట్లను చూపిస్తూ... కిషన్ రెడ్డి కూడా కుడి భుజానికి దట్టీ కట్టుకున్న ఓ ఇమేజ్ ను పోస్ట్ చేశారు. కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకునే  ఫొటోను కూడా షేర్ చేసి కామెంట్లు రాస్తున్నారు. దీంతో బీజేపీ వైపు నుంచి ఆన్సర్ లేకుండా పోయింది.

అయితే కిషన్ రెడ్డి చాలా కాలంగా పార్టీలో యాక్టివ్ గా ఉండడం లేదని, కేవలం పదవిని అడ్డు పెట్టుకొని మీడియాలో ప్రచారం చేసుకోవడమే తప్ప పార్టీ కోసం ఎక్కడా పని చేయడం లేదన్న విమర్శలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. కట్టర్ హిందూవాదిగా బండి సంజయ్, ఆ తరువాత అర్వింద్ లు దూకుడు ప్రదర్శిస్తుంటే కిషన్ రెడ్డి చాలా వెనుకబడిపోయారు. దీంతో పార్టీలో ఆయన మీద సదభిప్రాయం పోయిందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే హోంమంత్రిత్వ శాఖ నుంచి తప్పించి టూరిజంకు బదలాయించారని, అప్పట్లో భైంసాలో జరిగిన ఘటనపైనా కిషన్ రెడ్డి స్పందించకపోవడంతో... పార్టీ పెద్దలు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్ లకు చాలా హాట్ టాపిక్ తో కౌంటర్ ఇవ్వాలనుకొని కిషన్ రెడ్డి అభాసుపాలయ్యారంటున్నారు నెటిజన్లు.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.