Publish Date:Apr 18, 2013
బయ్యారం గనులలోని ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టి.ఆర్.ఎస్. నేతలు హరీష్ రావు, టి.ఆర్.ఎస్.ఎల్పీ నేత ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సబ్యుడు వి.హనుమంతరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విభేదించగా లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ స్వాగతిస్తున్నారు. గనుల కేటాయింపుపై మాట్లాడుతూ హరీష్ రావు ... విశాఖ స్టీల్స్ కు తెలంగాణాలోని గనులు అప్పగిస్తే తెలంగాణాకు ఎలాంటి లాభం చేకూరుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని , తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బొకారో స్టీల్ ఫ్యాక్టరీ లాంటి భారీ ఫ్యాక్టరీ బయ్యారంలో స్థాపించి లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది తెలంగాణా యువతకు ఉద్యోగాలు కల్పించారో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. టి.ఆర్.ఎస్. ఎల్పీ నేత ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణాలోని సహజ వనరులను తాతజాగీరులా సీమాంధ్రకు కట్టబెడితే ఖబడ్దార్ అని ఘాటుగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అని ఖమ్మం జిల్లాలోని ఖనిజాన్ని ఇక్కడే వినియోగించుకునేందుకు వీలుగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బయ్యారం, తెలంగాణాలోని బాగా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడే ఉక్కుపరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నెలకొల్పాలని, దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సిఎంకు లేఖ రాశారు. బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయిస్తే సరిపోదని, దాని ద్వారా ఖమ్మంలో పూర్తీస్థాయి స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆలస్యంగానైనా బయ్యారం సహా 5342 హెక్టార్ల ఇనుపగనులను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-opposes-bayyaram-mines-allotment-to-vsp-39-22573.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.