తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం, నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి చేరి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. రెండు దశాబ్దాల తన ప్రజా జీవితం మరుపురాని మధుర జ్ఞాపకం అని ఆయన కొనియాడారు. కేవలం రేవంత్ రెడ్డి అనే పేరుతో ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణాన్ని, ప్రజలు ఆదరించి 'రేవంతన్న'గా తమ గుండెల్లో నిలిపిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభమైన తన తొలి రాజకీయ అడుగులను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా మిడ్జిల్ లో మొదలైన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో సందర్భాలు, మరెన్నో రాజకీయ పరిణామాలు, తీవ్రమైన సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అయితే ప్రతి కష్టకాలంలోనూ, ప్రతి మలుపులోనూ ప్రజలు తనకు అండగా నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సుదీర్ఘ ప్రస్థానం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఇదే ప్రజాదరణ, స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలనేదే తన ఏకైక సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను ఒక సామాన్య శ్రామికుడిగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే ఒక నమ్మకమైన సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార గర్వం లేకుండా, కేవలం ప్రజల మనిషిగా, అందరి 'రేవంతన్న'గా ప్రజా హృదయాల్లో మరింత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడమే తన ఆశయమని ఆయన ఈ మైలురాయి సందర్భంగా ఉద్ఘాటించారు. 2006 నుంచి 2026 వరకు సాగిన ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒంటరి పోరాటాలు చేసి, చివరకు ప్రజా బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రయాణం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-revanth-reddy-39-225040.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది