బతుకమ్మ కోసమో...జి.హెచ్.యం.సి. ఎన్నికల కోసమో?

Publish Date:Oct 2, 2015

Advertisement

 

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి తెరాసతో ఉన్న రహస్య అనుబంధం మరోమారు నిన్న బయటపడింది. మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు తెలపడం ద్వారా తమ రెండు పార్టీల మధ్య రహస్య అనుబంధం కొనసాగుతోందని జగన్మోహన్ రెడ్డి స్వయంగా దృవీకరించినట్లయింది. తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె మరియు ఎంపీ కవిత నిన్న హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో మంతనాలు సాగించారు. కానీ జగన్ భార్య భారతిని బతుకమ్మ పండుగలో పాల్గొనమని ఆహ్వానించేందుకే ఆమె వచ్చేరని వైకాపా చెప్పుకొంటోంది.

 

ఆంధ్రా నేతలు, పార్టీలు తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకు తిన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు ఆరోపించడం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రా నేతలను, పార్టీలనే కాదు...సాక్షాత్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా తెలంగాణాని దోచుకొన్నారని తెరాస నేతలు ఆరోపిస్తునే ఉన్నారు. మరి అటువంటప్పుడు తమని దోచుకొన్న అదే నేత కొడుకు ఇంటికి తెరాస ఎంపీ కవిత వెళ్లి అతని భార్యని  బతుకమ్మ ఆడుదామని ఎందుకు పిలుస్తున్నట్లు? దాని అంతర్యం ఏమిటి? అనే సందేహాలు కలుగక మానవు.

 

ఎన్నికలలో ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆంధ్రా నేతలు దోపిడీ గురించి, ఇంకా అవసరమయితే రాజశేఖర్ రెడ్డి తెలంగాణాకు చేసిన అన్యాయం, ద్రోహం  గురించి తెరాస నేతలు గట్టిగా మాట్లాడుతుంటారు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణాకు అన్యాయం చేసారు కానీ తెరాసకు కాదు కనుక మిగిలిన సమయంలో మాత్రం తమ తమ రాజకీయ అవసరాల నిమిత్తం వైకాపాతో స్నేహంగా ఉంటారు. వైకాపా అధినేత జగన్ ఇంటికి వెళ్లి ఆయన భార్య భారతిని మాత్రమే బతుకమ్మ ఆడేందుకు పిలవడంలో అంతర్యం కూడా అదే అయిఉండవచ్చును. లేకుంటే చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా ఆమె వెళ్లి ఆహ్వానించేవారు.

 

కానీ మళ్ళీ అక్కడే చాలా తెలివిగా తెదేపాను ‘ఫిల్టరింగ్’ చేసేసారు. కవిత వెళ్ళింది సాక్షి మీడియా చైర్ పర్సన్ భారతిని కలవడానికి కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పడం చూస్తే “ఆహా! ఏమి తెలివితేటలు? అని అందరూ ఆశ్చర్యపోక తప్పదు. సాక్షి మీడియా చైర్ పర్శన్ భారతిని ఆహ్వానించారు కనుక మిగిలిన మీడియా అధినేతల అందరి ఇళ్ళకు వెళ్లి వారి భార్యలను కూడా కవిత ఆహ్వానిస్తారనుకోలేము. ఎందుకంటే వారందరికీ రాజకీయ పార్టీలు లేవు. అయితే ఇంతకీ కవిత లోటస్ పాండ్ కి ఎందుకు వెళ్ళినట్లు? అని ఆలోచిస్తే వరంగల్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలలో, జి.హెచ్.యం.సి. ఎన్నికలలో వైకాపా మద్దతు లేదా సహకారం కోరడానికే అయ్యుండవచ్చును.

 

వరంగల్ పట్టణంలో కూడా ఆంధ్రాకు చెందినవారు చాలా మందే స్థిరపడి ఉన్నారు. కనుక వాళ్ళకి గాలం వేయాలంటే వైకాపా ఉండాల్సిందే. ఇక జి.హెచ్.యం.సి. వార్డుల పునర్విభజన నిలిపివేస్తున్నట్లు ఈ మధ్యనే తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జి.హెచ్.యం.సి.పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఏరివేసే ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వస్తోంది. జి.హెచ్.యం.సి. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించడానికి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతోంది. కనుక ఈ ఏడాది చివర్లోగా జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

 

హైదరాబాద్ లో ఆంధ్రా ఓటర్ల ఏరివేయడం, విద్యుత్ సంస్థల నుండి 1239 మంది ఉద్యోగులను తొలగించడం వంటి అనేక కారణాల వలన ఆంధ్రా ప్రజల నుండి తెరాస తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంది. కనుక ఈ ఎన్నికలలో మిగిలిన ఆంధ్రా ఓటర్లకు గాలం వేయాలంటే వారికి 'ఆంధ్రా గాలాన్నే' ఉపయోగించవలసి ఉంటుంది. అందుకే బతుకమ్మ పండుగకి భారతిని ఆహ్వానించే సాకుతో తెరాస, వైకాపా నేతలిద్దరూ లోటస్ పాండ్ లో మంతనాలు సాగించి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకి మద్దతు తెలిపిన జగన్, ఈ ఎన్నికలలో మాత్రం దానికి మద్దతు, సహకారం ఇవ్వకుండా ఉంటారనుకోలేము.  

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.