విపక్షాల సవాళ్లకు జవాబేది? టీఆర్ఎస్ ఓటమి ఒప్పుకున్నట్టేనా? 

Publish Date:Oct 5, 2021

Advertisement

హుజూరాబాద్ ఉప ఎన్నిక  దగ్గరవుతున్నకొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. వేడి పెరిగే కొద్దీ అధికార తెరాసలో వణుకు పెరుగుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.  ప్రత్యర్ధి పార్టీలు సంధిస్తున్న సవాళ్ళకు తెరాస నాయకులు సమాధానలు చెప్ప లేక కిందా మీదా అవుతున్నారు. నిజానికి మొదటి నుంచీ కూడా అనేక విషయాల్లో డిఫెన్సు పడిపోయిన తెరాస నాయకులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగి పోతున్నారు. అవస్థలు  పడుతున్నారు. అందుకే, ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన కారణాల మొదలు ఇప్పుడు తాజాగా అయన చేసిన రాజకీయ సన్యాసం సవాలు వరకూ ఏ ఒక్క సవాలుకు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఏ ఒక్క నాయకుడు జవాబు చెప్పే సాహసం చేయలేక పోతున్నారు. 

తాజాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల నేరుగా, కేసీఆర్ కే సవాలు విసిరారు.ఉప ఎన్నికల్లో తాను ఓడిపోతే, రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రాజకీయాలకు శాశ్వతంగా స్వస్తి చెపుతానని, తెరాస ఓడిపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. నిజానికి ఇదే సవాలును ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అద్యక్షు బండి సంజయ్ గతంలోనూ చేశారు. అయినా కేసీఆర్ కాదు, చివరకు తెరాస నాయకులూ ఎవరూ ఆ సవాలు స్వీకరించలేదు. చివరకు, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, సమాధానం చెప్పలేక మోకాలుకు బోడి గుండుకు ముడి పెడుతూ.. బెంగాల్లో భవానీపూర్ నియోజక వర్గంలో బీజేపీ ఓడిపోతే ప్రధాని మోడీ రాజీనామా చేశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే, ఎప్పుడో రెండు నెలల క్రితం దమ్ముంటే, గెలుపు మీద ధీమా ఉంటే, కేసీఆర్ లేదా హరీష్ రావు పోటీచేయాలని ఈటల విసిరిన సవాలుకు, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఇంతవరకు స్పందించలేదు. జవాబు చెప్పలేదు. 

అన్నిటికంటే విచిత్రం ప్రతిపక్షాలు ఒకటంటే మీరు నాలుగు అనండి, అని హైదరాబాద్ కార్యకర్తలకు క్లాసు పీకిన, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షడు, మంత్రి కేటీఆర్, తన దగ్గరకు వచ్చే సరికి, కోర్టును ఆశ్రయించి, రక్షణకవచం తెచ్చుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ విషయంలోనూ కేటీఆర్, ఎస్కేప్ రూట్ లో పక్కదారి చూసుకున్నారు. నీ సంగతి చెప్పవయ్యా అంటే, కేటీఆర్ సమాధానం చెప్పకుండా రాహుల్’ గాంధీ పరీక్షలు చేయించుకుంటే తానూ చేయించుకు కుంటానని తప్పించుకున్నారు. నిజానికి, కేటీఆర్ సవాలు స్వీకరించక పోవడంతో అంతవరకు రామన్న మంచి బాలుడు అనుకున్న వారిలో కూడా, అనుమానాలు రేకెత్తించింది. 

రాజకీయాలలో ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలలో ప్రత్యర్ధులు విసిరినా సవాలుకు, సమాధానం చెప్పక పోవడం, చెప్పలేక పోవడం రెండూ కూడా ఓటమిని అంగీకరించడంమే అవుతుందని, అంటారు. అదే నిజం అయితే, తెరాస ఓటమిని అంగీకరించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులే కాదు, సామాన్య జనం కూడా అంటున్నారు. నిజానికి, దళిత బంధు వంటి భారీ పథకాన్ని ఓటర్లకు ఎరవేసినప్పటికీ, రూ.4,700 కోట్ల విలువ చేసే పనులకు జీవోలు జారీ చేసినా, అధికార పార్టీ ఇంకా ప్రతిపక్ష పార్టీల సవాళ్ళకు సమాధానం చెప్పలేక పోవడం, నిజంగా అధికార పార్టీ బలహీనతను బయట పెడుతోందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.