వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వెంట్రుక కూడా పీకలేరా!?.. ఫుల్ ట్రోలింగ్...
Publish Date:Apr 13, 2022
Advertisement
నా వెంట్రుక కూడా పీకలేరు.. అంటూ ఇటీవల సీఎం జగన్ చేసి చూపిస్తూ చెప్పిన డైలాగ్ ఫుల్ వైరల్ అయింది. అంతకుమించి కాంట్రవర్సీగా కూడా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.. అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని సభ్య సమాజం మండిపడింది. స్కూల్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఉన్న సభలో పీకుడు లాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడాన్ని అంతా తీవ్రంగా తప్పుబట్టారు. అయితే, ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు.. వైసీపీ ఆశావహుల ఆగ్రహ జ్వాలలతో జగన్ డైలాగ్‌పై మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా నడుస్తున్నాయి. జగన్ పీకుడు ఫోటోను, డైలాగ్‌ను సోషల్ మీడియా విపరీతంగా వాడేసుకుంటోంది. జగన్ ఆ వ్యాఖ్యలు చేసింది ప్రతిపక్షాన్ని, మీడియాను కాదని.. తన పార్టీ ఎమ్మెల్యేలనే అంటూ సెటైర్లు పడుతున్నాయి. తనకు ఇష్టం వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చుకుంటా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ తన వెంట్రుక కూడా పీకలేరనేది జగన్ భావన అంటూ మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా, టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సైతం అదే భావన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్ వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించే చేశారని టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జగన్ వ్యాఖ్యలను అందరూ ప్రజలనో, మరొకరినో అన్నారని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నచ్చిన వారికి కేబినెట్‌లో అవకాశం ఇస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారని తెలిపారు. తాను చెప్పిందే వేద వాక్కు అని వారికి చెప్పకనే చెప్పారని ప్రభాకర్‌రెడ్డి వివరించారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్ ఉద్దేశం కావొచ్చన్నారు జేసీ. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/troll-on-cm-jagan-comments-39-134333.html





