మంత్రి రోజాకు దిష్టి తీసిన భర్త.. మొదటి సంతకం అక్కడే!
Publish Date:Apr 13, 2022
Advertisement
ఎన్నాళ్లో వేచిన ఉదయం. ఆర్కే రోజాకు మంత్రిగా అందలం. తన చిరకాల స్వప్నం నెరవేరడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు రోజా. మరో రౌండ్ దైవదర్శణాలు చేసుకొని.. పనిలో పనిగా జగన్ దర్శనం కూడా చేసుకున్నారు. పే..ద్ద సైజు పుల బొకేతో, కుటుంబ సమేతంగా జగనన్నను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మీ వెంటే నేనంటూ మరోసారి మాట ఇచ్చి వచ్చారు. ఇక, సచివాలయం రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆర్కే రోజా. తన ఛాంబర్‌లో అడుగుపెట్టే ముందర.. గుమ్మడికాయతో స్వయంగా ఆమె భర్త సెల్వమణి దిష్టి తీశారు. అనంతరం, పండితుల వేద ఆశీర్వచనాల మధ్య మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. "జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చేస్తాం. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో అనుకూలమైన టూరిజంను అభివృద్ధి చేస్తాం. క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి కృషి చేస్తా. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా క్రీడాకారులకు వసతులు కల్పిస్తాం. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు నాకు తెలుసు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటా. గండికోట నుంచి బెంగుళూరుకు పర్యాటకం కోసం బస్సు సర్వీసు ఏర్పాటుపై మొదటి సంతకం చేస్తా" అని అన్నారు మంత్రి రోజా.
http://www.teluguone.com/news/content/roja-taken-charges-as-minister-39-134339.html





