భూములు కబ్జా చేస్తున్న మంత్రి బాలరాజు
Publish Date:Mar 28, 2012
Advertisement
గిరిజన సంక్షేమ శాఖామంత్రి పి.బాలరాజు గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారో లేదో గాని గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కబ్జా చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. పాడేరు పాత ఐటిడిఎ కార్యాలయ స్థలాన్ని, చింతపల్లి ఎలక్ట్రిక్ బోర్డు స్థలాన్ని, గూడెంలోని కాఫీబోర్డు స్థలాన్ని మంత్రి బాలరాజు ఇప్పటికే కబ్జా చేశారని, ఇప్పుడు తాజాగా ఏజెన్సీప్రాంతంలో సుమారు 300 ఎకరాల భూములపై కన్నువేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి బాలరాజు భూకబ్జాలపై మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు పంపారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించి తన సంక్షేమాన్ని మాత్రమే చూసుకుంటున్నారని దేముడు విమర్శిస్తున్నారు. మంత్రి బాలరాజు భూకబ్జాలకు పాల్పడటమే కాకుండా అనేక అనైతిక పనులు కూడా చేస్తున్నారని, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దేముడు తన ఆరోపణలో పేర్కొన్నారు. తన ఆటలు సాగవనే ఉద్దేశ్యంతో పాడేరు ఐటిడిఎ కార్యాలయానికి ఐఎఎస్ అధికారిని నియమించకుండా బాలరాజు అడ్డుకుంటున్నారని సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రాను అడ్డుతోలగించి ఆయన స్తానలో తనకు అనుకూలమైన ఆర్డీవో స్థాయి అధికారిని నియమించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని దేముడు ఆరోపిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/tribal-welfare-minister-balaraju-24-12961.html





