ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కష్టాలను తీర్చే విషయంపై దృష్టి పెట్టింది. ఇందుకు తాజా తార్కాణం విశాఖపట్నం, రాజాం రోడ్డులో నాలుగేళ్ల కిందట శిథిలావస్థకు చేరి రాకపోకలకు అనువుగా లేని బ్రిడ్జిని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే. ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బ్రిడ్జి మూత వల్ల పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. రాజాం విశాఖల మధ్య దూరం కేవలం వంద కిలోమీటర్లే అయినప్పటికీ.. అదనంగా ఐదు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి.
మూతపడిన బ్రిడ్జికి బదులుగా కొత్త బ్రిడ్జి నిర్మాణం ఆరంభమైనప్పటికీ పనులు చాలా చాలా నెమ్మదిగా సాగాయి. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రైల్వే శాఖతో సమన్వయం కారణంగా నిధుల సమస్య లేకుండా పోయింది. అంతే నిర్మాణం ఏడాది కాలంలో పూర్తయ్యింది. ఈ కొత్త బ్రిడ్జిని సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఈ ఒక్క బ్రిడ్జితో నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ అన్నట్లుగా ఎగిరిపోనున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/travel-problems-disappear-with-one-bridge-36-211938.html
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి గురయ్యారు.
భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అవుతుండటం, మంటలు ఎగసిపడుతుండటంతో కోనసీమ వాసులు భయాందోళనలతో వణికి పోతున్నారు.
కుటుంబ సభ్యుల హితవచనాలు రుచించని ఆ మైనర్లిద్దరూ ఇంట్లో వారికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మదురోకు రక్షణగా ఉన్న తమ దేశ భద్రతా దళాలు అమెరికా కమెండోలను చివరి వరకు అడ్డుకున్నాయని వెల్లడించిన క్యూబా, వారు తమ బాధ్యతను అత్యంత గౌరవప్రదంగా, వీరోచితంగా నిర్వహించారని, ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలో, బాంబు దాడుల వల్ల వారు వీరమరణం పొందారని ఒక ప్రకటనలో పేర్కొంది.
కేరళ మలప్పురం జిల్లా కిళిస్సేరికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. వీరు తమ ఐదుగురు పిల్లలతో కలిసి అబుదాబిలో జరుగుతున్న ప్రసిద్ధ లివా ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి దుబాయ్ వస్తుండగా షాహామా సమీపంలో వీరి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య దీపిక చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె భర్త ఒక్కరే ఆమె పక్కన ఉన్నారు.
ప్రాజెక్టు నిర్మాణ పనులను నేరుగా పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.
ధర్మబీర్ గోఖూల్ దంపతులకు దేవాలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు.
కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది.
భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది.
అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శనగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనుజులాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.
నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లెని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.