సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, దానిని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య అంతకు మించిన వేగంతో పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అధికారులను సైతం విస్తుపోయేలా చేసింది.ఏఐ సాధనమైన చాట్ జీపీటీని ఉపయోగించి ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులను సృష్టించి, ఒక ఉద్యోగిని మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ మోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన రమణమ్మ కడప జిల్లా గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇంటికి దూరంగా పని చేయడం ఇబ్బందిగా మారడంతో.. ఆమె తన స్వగ్రామానికి సమీపంలోని తనకల్లుకు బదిలీ కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె భర్త జయచంద్ర తనకు తెలిసిన పలక వేణు అనే వ్యక్తిని సంప్రదించారు. దీనిని అవకాశంగా తీసుకున్న వేణు.. తన కుమారుడు గంగాద్రితో కలిసి రమణమ్మను మోసం చేసేందుకు భారీ స్కెచ్ వేశారు.
నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు. చూడటానికి అసలైన ప్రభుత్వ ఆర్డర్ లాగే ఉన్న ఆ నకిలీ కాపీని జయచంద్రకు అందజేసి.. అతడి నుంచి భారీగా సొమ్ములాగేందుకు ప్రయత్నించారు.
ఒక ఆ నకిలీ ఉత్తర్వులను పట్టుకుని రమణమ్మ తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో చేరేందుకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. అక్కడ ఉన్న వైద్యాధికారులు ఆ ఉత్తర్వులను పరిశీలించి, అవి శాఖాపరంగా జారీ చేసినవి కావని తేల్చారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, చాట్ జీపీటీ ద్వారా ఈ నకిలీ కాపీని సృష్టించినట్లు నిర్ధారించి నిందితులు వేణు, గంగాద్రిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనతో ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతోంది. బదిలీలు లేదా ఇతర అధికారిక పనుల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దనీ.. కేవలం అధికారిక వెబ్‌సైట్లు లేదా ఉన్నతాధికారుల ద్వారానే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/transfer-orderusing-chatgpt-36-218696.html
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెట్రోల్ బంక్‌లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.
ఇది సాధారణ చోరీ ప్రయత్నమా.. అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్, పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్‌కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు.
జపాన్ ప్రధానమంత్రి సనాయే టకాయిచీతో ఫోన్ లో మాట్లాడిన పెజెష్కియాన్, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని విమర్శించారు. ఇరాన్ నౌకలపై అమెరికా పాల్పడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు.