టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే యావలో చాలామంది ఎదుర్కునే అతిపెద్ద సమస్య..!

Publish Date:Jul 29, 2026

Advertisement

టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండటం మంచిదేనా?

జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "అంతా సర్దుకుంటుంది," "ఎప్పుడూ పాజిటివ్ గా  ఆలోచించు!".. ఇలా చాలా మంది  ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. ఈ మాటలు వినడానికి బానే ఉంటాయి.  కానీ మనస్తత్వవేత్తలు మాత్రం ఇది సరికాదు అంటున్నారు.  దీన్ని టాక్సిక్ పాజిటివిటీ అని పిలుస్తారట.  ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. కష్టంలో  ఉన్నప్పుడు పాజిటివిటీ మాటలను  ఒక మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు. కానీ ఇది కాలక్రమేణా మనిషిని ఒంటరిని చేస్తుందని మానసిక విశ్లేషణ నిపుణులు అంటున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

టాక్సిక్ పాజిటివిటీ అంటే..

సులభంగా చెప్పాలంటే టాక్సిక్ పాజిటివీటి  అంటే మనిషిలో ఉండే నిజమైన ఫీలింగ్స్ ను అంగీకరించకుండా వాటిని దాచడానికి ప్రయత్నించడం.

ఈ రోజుల్లో, సోషల్ మీడియా కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా "బలంగా ఉండాలి" అనే మనస్తత్వం వల్ల ప్రజలు తమ దుఃఖాన్ని, భయాన్ని లేదా వైఫల్యాన్ని వ్యక్తపరచడానికి సంకోచిస్తున్నారు. అలా వ్యక్తం  చేయడం ఒక పెద్ద బలహీనత అని అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా, బలంగా కనిపించాలనే  తీవ్రమైన ఒత్తిడి  వ్యక్తిలో అపరాధ భావాన్ని మాత్రమే పెంచుతుంది.

ఎమోషన్స్ అణిచివేత ప్రమాదం..

మనిషిలో ఉండే నిజమైన , ప్రతికూల భావోద్వేగాలను దాచుకోవడం చాలా హానికరం అని మానసిక పరిశోధనలు కూడా స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. తమ ఎమోషన్స్  ను అణచిపెట్టుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు అకస్మాత్తుగా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

మనిషి తన నెగిటివ్ ఎమోషన్స్ ను నిరంతరం అణచివేస్తే, వారి ఒత్తిడి వేగంగా పెరుగుతుందట. ఇది సంబంధాలపైనా, మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యక్షంగా, చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట.

నిజమైన మానసిక బలం..

మనిషిలో ఉన్న ఎమోషన్స్ ను ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మానసిక బలం అని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. విచార భావనలు ఎప్పుడూ తప్పు కాదు. వాటిని అణచివేయకుండా అర్థం చేసుకుని స్వీకరించడమే మనిషిని మానసికంగా దృఢంగా చేస్తుంది.

నిజమైన మానసిక బలం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు, మనుషులుగా మనం కొన్నిసార్లు కుంగిపోవడం సహజమని అంగీకరించడమే.

టాక్సిక్ పాజిటీవిటీ నుండి బయట పడటానికి సూచనలు..

విచారాన్ని బలహీనతగా భావించకూడదు..

ఎమోషన్స్ ను,  అభిప్రాయాలను  ఓపెన్ గా  వ్యక్తపరచాలి,  విచారాన్ని ఓటమిగా పరిగణించకూడదు.

నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం..

కష్ట సమయాల్లో ఆన్‌లైన్‌లో ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడానికి బదులుగా, మీరు బాగా నమ్మే వ్యక్తులతో   సమస్యలను నిష్కపటంగా పంచుకోవాలి. దీని వల్ల ఊరట లభిస్తుంది, భారం తగ్గినట్టు అవుతుంది.

సలహా ఇవ్వడానికి బదులుగా వినాలి..  

మీ చుట్టూ ఎవరైనా విచారంగా ఉంటే, వారికి ఊరట ఇవ్వడానికి భరోసా మాటలు చెప్పడానికి బదులుగా వారి సమస్య ఏంటో మొదట ఓపికగా వినాలి.  తమ భాదను వెంటే చాలామంది మానసికంగా కుదటపడతారు, తిరిగి ధైర్యం కూడా తెచ్చుకుంటారు.

"సానుకూల ఆలోచన"తో అస్సలు మార్చలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. అందువల్ల,  విచారాన్ని పూర్తిగా కొట్టిపారేయడం పాజిటివ్ మార్గం కాదు, అది ఆత్మవంచన. కాబట్టి ఎప్పుడూ అన్నిటికీ పాజిటివ్ గా ఉండాలని, పాజిటివ్ జరగలేదని బాధపడకూడదు.

 

                         *రూపశ్రీ.

 

By
en-us Political News

  
జీవితంలో మనం ప్రతిరోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. కొన్ని పనులు ఆలోచించి చేస్తాం.. మరికొన్ని పనులు మాత్రం ఆవేశంలోనో..  
భార్యాభర్తల బంధం జీవితాంతం కలిసి నడవాల్సిన అనుబంధం. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉంటే ఈ బంధం ఎంతో ఆనందంగా ఉంటుంది.
ప్రతి వ్యక్తి జీవితంలో భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది.  ఒక వయసుకు వచ్చాక ముడిపడే ఈ బంధం మరణం వరకు తోడు ఉంటుంది.
మోకాలి నొప్పి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది గాయం వల్ల లేదా ఆర్థరైటిస్, గౌట్ , ఇన్ఫెక్షన్ వంటి కొన్ని సమస్యల వల్ల కూడా  సంభవించవచ్చు.
అవమానం, బాధ.. ఇవి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదుర్కునేవే.  నిజానికి చాలామంది అవమానం, బాధ అనేవి బాగా దగ్గరైన, ఎంతో ఇష్టపడిన వారి కారణంగానే అనుభవిస్తూ ఉంటారు.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది..
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది.
నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.