యశ్ టాక్సిక్ వేడుకలో ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు..!

Publish Date:Aug 23, 2026

Advertisement

 

మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై విమర్శలు.. ప్రీతిరెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్..!

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ చిత్రం 'టాక్సిక్' ప్రమోషన్ వేడుకలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఒక్కసారిగా ప్రమాదకరంగా మారింది. ఈవెంట్ మధ్యలో ఫ్లడ్ లైట్ స్తంభం కూలిపోవడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఈ వేడుకకు అభిమానులు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యశ్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో ప్రాంగణంలో ఉన్న ఫ్లడ్ లైట్ల స్టాండ్‌పైకి కొందరు ఉత్సాహంతో ఎక్కారు. దీంతో ఆ బరువును తట్టుకోలేక స్తంభం ఒక్కసారిగా కింద ఉన్న జనంపై కూలిపోయింది.

ప్రమాదం జరగడంతో వెంటనే స్పందించిన నిర్వాహకులు గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఊహించని ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో కాసేపు భయాందోళనలు, తీవ్ర అలజడి నెలకొన్నాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీశాయి. ఈవెంట్ ప్రారంభంలో ఆమె వేదికపై నుంచి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

"మన కాలేజీ పేరు నిలబెట్టాలి.. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద ఈవెంట్స్ ఇక్కడ జరగాలంటే మీ ప్రవర్తన బాగుండాలి" అని ప్రీతిరెడ్డి పేర్కొన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ క్యాంపస్‌లో ప్రమోషన్స్‌కు అనుమతి ఉండదని హెచ్చరిస్తూ మాట్లాడారు.

ప్రీతిరెడ్డి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ ఆవరణలో సినిమా ఈవెంట్లు ఏర్పాటు చేసి విద్యార్థుల డిసిప్లిన్ గురించి మాట్లాడటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ముందుగా సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా విద్యార్థులనే బాధ్యులను చేయడం సరికాదని మండిపడుతున్నారు.

విద్యాసంస్థల్లో ఇటువంటి భారీ సినీ వేడుకలు నిర్వహించడంపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీని నియంత్రించడంలో, మౌలిక వసతుల భద్రతను పర్యవేక్షించడంలో నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై కాలేజీ యాజమాన్యం, పోలీసులు దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. భారీ జనసందొహంతో కూడిన ఈవెంట్లలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయో ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.

Toxic Movie Event, Hero Yash, Malla Reddy University, Preethi Reddy Comments, Toxic Event Accident

By
en-us Political News

  
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.