అరకులో పర్యాటకుల రద్దీ...భారీగా ట్రాఫిక్
Publish Date:Dec 28, 2025
Advertisement
భూతల స్వర్గం అరకు.. అల్లూరి జిల్లా పర్యాటకులతో నిండిపోయింది. వరుస సెలవులతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు రావడంతో నిన్న రాత్రి నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. హొటల్ గదులు ఫుల్ అయ్యాయి. ఆదివారం కావడంతో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలకు టూరిస్టుల తాకిడంతో ఉడెన్ బ్రిడ్జి వద్ద పెరిగిన రద్దీ పెరిగింది. చల్లని వాతావరణాన్ని ఆహ్లాదించేందుకు… టూరిస్టులు వస్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను కెమెరాలను బంధిస్తున్నారు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్ కి తెగ డిమాండ్ పెరిగింది.బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ, మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, చాపరాయి గెడ్డ, పాడేరు కాఫీ తోటలు, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి ప్రాంతాల్లో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో రద్దీ నెలకొంది. శనివారం రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు కూడా భారీగా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
http://www.teluguone.com/news/content/tourist-rush-in-araku-36-211676.html





