ఏపీలో నియంత పాలన.. 30 కోట్లు హాంఫట్.. కరెంట్ కిరికిరి.. టాప్ న్యూస్ @ 1pm

Publish Date:Oct 12, 2021

Advertisement

1. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం పట్ల టీడీపీ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తే దారులపై కక్ష సాధింపులా అని నిలదీశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని అన్నారు.

2. దేశంలో, రాష్ట్రంలో నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. దేశంలో ప్రజలను బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారన్నారు. దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ తీసుకువచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని తెలిపారు. మోదీ సోషలిస్ట్ విధానాలను పక్కనపెట్టి కాపిటలిస్ట్ విధానాలు తీసుకువచ్చి దేశాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు.

3. వైసీపీ నేతలు రూ. 30 కోట్లు హాంఫట్ చేశారు. పంటల బీమా సొమ్ములో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. పత్తి చేలుగా మామిడి, పామాయిల్ తోటలను చూపించి కోట్లలో బీమా సొమ్ము స్వాహా చేశారు. పత్తి సాగు చేయకుండానే వైసీపీ నేతలు తుఫానులో దెబ్బ తిన్నట్లు రికార్డులు పుట్టించారు. ఒక్క మైలవరం నియోజక వర్గంలోనే రూ. 4 కోట్లు స్వాహా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదే దందా. రూ. 30 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.

4. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అమ్మవారిని దర్శించుకోడానికి కొండ పైకి వెళ్తున్న ఆయన వాహనాన్ని ఘాట్ రోడ్డు వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో కేశినేని నాని తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే కొండపైకి వెళ్లి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

5. రాయ్‌చూర్‌ ను తెలంగాణలో కలిపేయాలి’’ అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.‘‘తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి సరిహద్దుల ఆవల నుంచి కూడా ఈవిధంగా ధ్రువీకరణ లభిస్తోంది. సాక్షాత్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయ్‌చూర్‌ను తెలంగాణలో కలపాలని చెబుతున్నారు. ఆయన డిమాండ్‌ను స్వాగతిస్తూ అందరూ చప్పట్లు కొడుతున్నారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

6. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ....బీరుల తెలంగాణగా మార్చారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

7. దిశ కేసులో మాజీ సీపీ సజ్జనార్ వరుసగా రెండవరోజు  హైపవర్  కమిషన్ ముందు హాజరయ్యారు.  సజ్జనార్ ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్నారు. నేడు మరోసారి సజ్జనార్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. దిశ ఘటన పరిణామాల తరువాత ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై కమిషన్ విచారణ చేయనుంది.

8. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 1,72,113 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా ఉంది.

9. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వి.దుర్గా ప్రసాద్‌పై వేటు పడింది. ఏసీఏ నిబంధనలను ఉల్లంఘించారనే కారణాలపై అంబుడ్స్‌మెన్ విచారణ నిర్వహించింది. అంబుడ్స్‌మెన్ విచారణలో కార్యదర్శి దుర్గా ప్రసాద్‌పై వచ్చిన అభియోగాలపై విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో కార్యదర్శిని తప్పించడం‌తో పాటు 5 వేలు జరిమానా విధించారు.

10. విద్యుత్ సంక్షోభంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. బొగ్గు కొరతతో పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు నెలకొనడంపై దృష్టి సారించింది. దేశంలో విద్యుత్ సంక్షోభం వస్తుందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం పీఎంవో సమీక్ష నిర్వహించనుంది. అసలు దేశంలో థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎన్ని, వాటికున్న బొగ్గు నిల్వలు ఏ మేరకు ఉన్నాయి.. ఇప్పటి వరకు బొగ్గు నిల్వలు అడుగంటిపోవడానికి గల కారణాలేంటి? వాటికి సంబంధించి కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖ ఏయే చర్యలు చేపట్టాయన్న విషయంపై పీఎంవో సమీక్ష నిర్వహించనుంది.
 

By
en-us Political News

  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.