విశాఖ‌కు టాలీవుడ్‌!.. కారు కిరికిరి.. హిజాబ్‌పై మోదీ రియాక్ష‌న్‌.. టాప్‌న్యూస్ @7pm

Publish Date:Feb 10, 2022

Advertisement

1. సినీ ప‌రిశ్ర‌మ ఏపీకి షిఫ్ట్ అవ్వాల్సిందేనంటూ సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కనీసం 20 శాతం షూటింగ్ జరిపేలా చూడాలన్నారు. నెమ్మదిగా సినీపరిశ్రమ విశాఖపట్నం రావాలని తేల్చి చెప్పారు. తెలంగాణాతో పోలిస్తే సినీపరిశ్రమకి ఏపీ ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోందని గుర్తు చేశారు. అందరికీ విశాఖపట్నంలో ఇళ్ల స్థలాలు, స్టూడియోలకు భూములు ఇస్తాం.. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేయాల‌న్నారు సీఎం జ‌గ‌న్‌.

2. సినీ పరిశ్రమ సంక్షోభానికి శుభంకార్డు పడిన‌ట్టేన‌న్నారు చిరంజీవి. ఈ నెల చివరి నాటికి జీవో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. 5వ షోకు సైతం జగన్ ఆమోదం తెలిపారన్నారు. మ‌రోవైపు, తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమాల మనుగడ చాలా కష్టంగా ఉందన్నారు నటుడు ఆర్ నారాయణమూర్తి. నంది అవార్డులు ఇచ్చేలా చూడాలని సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న‌ కోరారు.

3. టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 67వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. మంత్రి సొంత జిల్లాలో సోమశిల డ్యాంకి మరమ్మతులు చేపట్టలేదని విమ‌ర్శించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తిచేయలేదని ఆరోపించారు.

4. అప్పులు, ఓవర్ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం మండిప‌డ్డారు. ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. వేజ్ అండ్ మీన్స్‌, ఓవర్ డ్రాప్టులు వాడటంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు ప‌ట్టాభి. 

5. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. హౌస్‌కి లీడర్ అయిన ప్రధాని పార్లమెంట్‌ను కించపరిచారని ఆ పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన బిల్లు పట్ల ప్రధాని సిగ్గుచేటు వ్యాఖ్యలు చేశారని.. సభా హక్కుల ఉల్లంఘించేలా ప్రధాని మాట్లాడారని మండిపడ్డారు.

6. పార్లమెంటులో కాపుల రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు లేవనెత్తారు. ఏపీలో వెంటనే కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలన్నారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారన్నారు. ఏపీ జనాభాలో 18% ఉన్న కాపులకు అభివృద్ధి ఫలాలు అందట్లేదని జీవీఎల్  అన్నారు.

7. ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. మే 2 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు.  ఉదయం తొమ్మిదిన్న‌ర‌ నుంచి మధ్యాహ్నం 12:45 వరకు టెన్త్ పరీక్షలు.. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ ఉంటుందని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

8. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లి తండాలో ప్రాధమిక పాఠశాల టీచర్ శ్యామలరావు ఓ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరికీ చెప్పొద్దంటూ వికలాంగురాలైన ఆ బాలికను బెదిరించాడు.  విష‌యం తెలిసి.. టీచ‌ర్‌ శ్యామలరావును గ్రామస్తులు గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

9. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని మోదీ హిజాబ్ ఎపిసోడ్‌పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు తమ హక్కులను కాపాడుకోవడానికి, ఓట్ల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయని మోదీ అన్నారు. ముస్లిం కుమార్తెల జీవితం ఎప్పుడూ వెనుకబడి ఉండేలా ఆ వ్యక్తులు.. ముస్లిం సోదరీమణులను మోసగిస్తున్నారని మోదీ విమర్శించారు.

10. 15వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో ఆఫ్‌లై‌న్‌లో ఇవ్వ‌నున్న‌ట్టు టీటీడీ తెలిపింది. రోజుకు 10వేలు చొప్పున భక్తులకు టోకెన్లు ఇస్తామ‌న్నారు టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిపై ఫిబ్రవరి 17వ తేదీన జరగనున్న పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.