సలహాదారులకు కోట్ల‌ల్లో జీతాలు!.. వాళ్లకి దోచిపెడుతున్న జ‌గ‌న్ స‌ర్కారు!

Publish Date:Feb 10, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది? వారికి ఇచ్చే జీతభత్యాల సంగతేంటి? వారంతా ఎవరికి.. ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలపై ఏపీలోని సాధారణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. సలహాదారుల పేరుతోనే కాకుండా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వాటి డైరెక్టర్ల నియామకం పేరుతో నెలనెలా కోట్లాది రూపాయల జనం సొమ్మును జగన్ సర్కార్ దోచిపెడుతోందనే విమర్శలు ఉన్నాయి.

జగన్ రెడ్డి సర్కార్ ప‌దుల సంఖ్య‌లో సలహాదారులను నియమించుకుంది. ఆ సంఖ్య 40కి పైనే అంటారు.  వారిలో ఓ 10 మందికి కేబినెట్ ర్యాంకు కూడా ఇచ్చింది. వారికి కేబినెట్ హోదాలోనే జీతభత్యాలు ఇస్తోంది. ఒక్కో ప్రభుత్వ సలహాదారుకు నెలనెలా 3 లక్షల వరకూ జీతం రూపేణా జనం ధనం అందుతోంది. ఇతర భత్యాల రూపంలో మరో 2 లక్షల వరకు ముడుతోంది. అంటే, అడ్వైజ‌ర్లు అంద‌రికీ క‌లిపి నెల‌కు సుమారు 2 కోట్లు ఖ‌ర్చు అవుతోంది. ఇక‌, సలహాదారుల్లో చాలా మందికి కారు, డ్రైవర్, ఇతర సిబ్బంది లాంటి సౌకర్యాలు కూడా జగన్ ప్రభుత్వం కల్పించింది. అలాంటి వారికి ఇచ్చే జీతాలు ఆ 2 కోట్ల‌కు అదనం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా.. సలహాదారులకే ఎక్కువ జీతం ఇస్తున్నారని అంటున్నారు. 

ఏపీలో రిటైర్డ్ సీఎస్ అజయ్ కల్లాంను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా జగన్ రెడ్డి నియమించుకున్నారు. అయితే.. అనంతర కాలంలో ఆయన పవర్ క‌ట్ చేశారు జగన్క. కె.రామచంద్రమూర్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, జుల్ఫీరావ్డీ, సాగి దుర్గాప్రసాదరాజు, తలశిల రఘురాం, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, పీటర్ హసన్, ఎం.శామ్యూల్ కు జగన్ రెడ్డి సర్కార్ కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది. వీరిలో అజయ్ కల్లాంకు ఇప్పుడు అధికారాలు లేవు. తన సలహాలు తీసుకోవడం లేదని అలిగిన రామచంద్రమూర్తి పదవికి రాజీనామా చేశారు. దేవులపల్లి అమర్ అయితే.. అడపా దడపా టీవీ చర్చల్లో పాల్గొంటారు. జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాలను సమర్థించలేక సతమతం అవుతుంటారు. జీవీడీ కృష్ణమోహన్ సీఎం స్పీచ్ లు రాస్తుంటారు. తలశిల రఘురాం వైసీపీ కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేస్తుంటారు. చాలామంది సలహాదారులకు పెద్ద‌గా పనేమీ ఉండదంటారు. అయినప్పటికీ, కేవ‌లం ల‌క్ష‌ల్లో జీత‌భ‌త్యాలు ఇచ్చేందుకే అన్న‌ట్టు.. వారంద‌రినీ అడ్వైజ‌ర్లుగా పెట్టుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో హైకోర్టు సైతం అంత‌మంది స‌ల‌హాదారులు ఏంట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ప్ర‌జాధ‌నాన్ని ఇలా స‌ల‌హాదారుల పాలు చేయ‌డం ఏంట‌నేది ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్న‌.

ఇక ప్రభుత్వ సలహాదారులు అంద‌రిలోకి సజ్జల రామకృష్ణారెడ్డి దారి వేరు, తీరు వేరు. ఏపీ సీఎం జగన్ మౌత్ పీస్ మాదిరిగా వ్యవహరిస్తుంటారు. సజ్జల చెబితే జగన్ చెప్పినట్లే అనే రేంజ్ లో ఆయన వ్యవహారం ఉంటుంది. సజ్జల ‘ఆల్ ఇన్ వన్’ అన్నమాట. ఒకే ఒక్క పవర్ ఫుల్ సలహాదారు సజ్జల. యాక్టింగ్ సీఎం మాదిరి. ప్రజా వ్యవహారాల సలహాదారు అనేది సజ్జలకు ఇచ్చిన పోస్టు. అయితేనేం.. అన్ని శాఖల వ్యవహారాలనూ ఆయనే చక్కబెట్టేస్తారు. డీజీపీ ఆఫీస్ మొత్తం సజ్జల కనుసన్నల్లోనే ఉంటుందనేది టీడీపీ నేతల నుంచి తరచుగా వస్తున్న ఆరోపణ. మిగతా సలహాదారులకు పని ఉన్నా లేకపోయినా గానీ సజ్జలకు మాత్రం ఒక్క క్షణం కూడా తీరికే ఉండదు. ఆయన చక్కబెట్టాల్సిన వ్యవహారాలు అంతలా ఉంటాయి మరి!

కేబినెట్ హోదా లేని సలహాదారులు, సహాయ సలహాదారులు కూడా ఓ 23 మంది వరకు ఉన్నారు. వారికి కూడా కేబినెట్ ర్యాంక్ ఉన్న సలహాదారులతో సమానంగానే జీతభత్యాలు అందుతుంటాయి. కాకపోతే వారికి ప్రోటోకాల్ వర్తించదు అంతే. ప్రత్యేక ఆబ్లిగేషన్ ప్రకారం కొందరిని సలహాదారులుగా నియమించారని అంటారు. అలాంటి వారికి జీతభత్యాలు ఇవ్వడం లేదు. గత ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో హంగామా చేసిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి నుంచి వివిధ సందర్భాల్లో తమ పార్టీకి, తనకు సహకరించిన వారికి కృతజ్ఞతగా సలహాదారు పదవులు ఇచ్చినట్లు చెబుతుంటారు. తెలంగాణకు చెందిన డాక్టర్ శిల్పా టేకుపల్లికి ఢిల్లీలో ఉండేలా హెల్త్ సలహాదారు పదవిని జగన్ సర్కార్ కట్టబెట్టింది. డాక్టర్ శిల్పా టేకుపల్లికి ఢిల్లీలో నివాస అవసరం తీర్చేందుకు ఈ పదవి ఇచ్చారని టాక్‌. 

ఇక ఏపీలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, పాలక మండళ్లను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఏపీలో ఉన్న మొత్తం136 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా 56 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. మొత్తం 80 కార్పొరేషన్లకు చైర్మన్లు, 960 మంది డైరెక్టర్లను జగన్ రెడ్డి నియమించారు.

నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా నెలనెలా ప్రజల సొమ్ము పెద్ద మొత్తంలో జీతంగా అందుతుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక్కో కార్పొరేషన్ చైర్మన్ కూ నెల జీతంగా లక్ష రూపాయలు ముట్టజెపుతుంది ప్రభుత్వం. అలా చూసుకుంటే ఏపీలోని మొత్తం 136 మంది నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. అంటే వారికి నెల నెలా కోటీ 36 లక్షల రూపాయలు జీతంగా అందుతుంది. దాంతో పాటుగా ఒక్కో నామినేటెడ్ చైర్మన్ కు ప్రభుత్వ క్వార్టర్ ఉంటే సరి.. లేదంటే ప్రతి నెలా ఒక్కొక్కరికీ 50 వేల రూపాయలు ఇంటి అద్దెగా చెల్లిస్తుంది. అంటే ప్రతి నెలా వారి ఖాతాల్లోకి ఇంటి అద్దె రూపేణా 68 లక్షల రూపాయలు వెళ్లిపోతాయి. వారు అద్దె ఇంట్లో ఉన్నా లేక సొంతింట్లో ఉన్నా అంతే మొత్తం వారికి అందిపోతుంది. ఒక్కో చైర్మన్ కు ప్రభుత్వమే వాహనం సమకూరిస్తే సరి.. లేదంటే వెహికల్ అలవెన్స్ కింద నెలకు మరో 50 వేల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తుంది. అంటే ఈ మొత్తం కూడా నెలకు 68 లక్షల రూపాయలన్నమాట. దాంతో పాటుగా ఒక్కో నామినేటెడ్ చైర్మన్ కు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి లేదా మంత్రితో సమానంగా వైద్య సదుపాయాలు ఉంటాయి. ఇక ఒకసారి గ్రాంట్ కింద ఒక్కో చైర్మన్ కు వంటింటి పాత్రలు, ఇతర సామాన్ల కోసం లక్షా 50 వేల రూపాయలు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా చూస్తే ఏపీలోని మొత్తం నామినేటెడ్ చైర్మన్లకు కోటీ 4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇంకో విషయం ఏమంటే.. ఒక్కో చైర్మన్ కు ఇంటికి సంబంధించిన ఫర్నీచర్ కోసం 3 లక్షల రూపాయలు ఖర్చు చేయవచ్చు. అలా చూస్తూ.. ఏపీలోని 136 మంది నామినెటెడ్ చైర్మన్లకు మొత్తం 4 కోట్ల 8 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్న మాట.

కార్పొరేషన్ల చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమితులైన వారికి రాజకీయ పునరావాసంలో భాగంగానే ఇలాంటి పదవులు వరిస్తాయనే వ్యాఖ్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాక, ఒకవేళ వచ్చినా గెలవని అత్యంత ఆప్తుల కోసం ఇలా నామినేటెడ్ పోస్టుల పందేరం చేస్తారంటారు. ఇలాంటి వారికి కూడా జీత, భత్యాల పేరుతో పెద్ద మొత్తంలో ప్రజల కష్టార్జితాన్నే దోచిపెడుతుండడం గమనార్హం. ఇలా ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం కార్పొరేషన్ పదవుల పేరుతో ఏలినవారి అస్మదీయులకు, పార్టీకి సేవలు చేసినవారి జేబుల్లోకి పోతుండడం విశేషం. జగన్మోహన్ రెడ్డి ఇంత మంది సలహాదారుల నుంచి ఎలాంటి సలహాలు స్వీకరిస్తున్నారో తెలియదని రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అసలే ఆర్థికంగా దిగజారిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఏపీ. ఎలాంటి అభివృద్ధీ లేకుండా కునారిల్లిపోతున్న ఏపీకి ఇలా సలహాదారులు, కార్పొరేషన్ల పేరుతో కోట్లకు కోట్లు దోచిపెట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమా? అనే ప్రశ్న ఆర్థిక, రాజకీయ రంగాల నిపుణుల నుంచి వస్తోంది. అయితే.. ఇలా జనం సొమ్మును స‌ల‌హాదారుల పాలు చేస్తున్న జ‌గ‌న‌న్న మాత్రం.. ఎవరి సలహాలూ అడగరని.. ఇచ్చినా తీసుకోరని అంటారు. అంత‌మాత్రానికి మ‌రెందుకు ఇంత‌మంది స‌ల‌హాదారులనేదే అస‌లు ప్ర‌శ్న‌. జ‌గ‌న‌న్నా.. మ‌జాకా..!!

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.