ఉద్యోగులకు వార్నింగ్..సంపుల్లో నోట్ల కట్టలు..రమేష్ కు నివాళి.. టాప్ న్యూస్@1PM
Publish Date:Jan 9, 2022
Advertisement
నెల్లూరు టీఎన్ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అలీఖాన్‌తో సహా ముగ్గురు కార్యకర్తలపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నక్కా గోపాల్ నగర్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా అలీఖాన్ పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయనపై కక్ష కట్టిన వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు.
----
ఆందోళన చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బెదిరింపులు వస్తున్నాయి. విశాఖ జిల్లాలోని ఓ తహసీల్దార్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు చేస్తూ తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చారు. సోమవారం విధులకు హాజరు కాని వారిని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు
--------
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పెట్టారన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలైనా... ఏ ఎన్నికలైనా ప్రజలు జగన్ వైపే ఉన్నారన్నారు.
--------
పంజాబ్‌లో ప్రధాని భద్రతా వైఫల్యంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల బుద్ధిని ప్రజలు నిలదీయాలంటూ బీజేపీ నినాదాలు చేసింది. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.... ప్రధానికి పంజాబ్ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోవడం నిర్లక్ష్యమేనన్నారు. ఈ అంశంపై సోనియాగాంధీ దాటవేత దోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. దేశ ప్రజలందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారని తెలిపారు
--------
కర్నూల్ జిల్లాలోని ఆదోనిలో పందుల దొంగలు బీభత్సం సృష్టించారు. పందుల దొంగతనాన్ని అడ్డుకునేందుకు యత్నించిన వ్యక్తిని హత్య చేశారు. వాహనాన్ని వెంబడించిన సురేష్ అనే వ్యక్తిని వాహనంతో ఢీకొట్టి కర్నాటకకు చెందిన దుండగులు హత్యకు పాల్పడ్డారు. అనంతరం అక్కడే వాహనం వదిలేసి దొంగలు పారిపోయారు.
------
టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. టీఆర్ఎస్ చెప్పినట్లే పోలీసులు పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. 'రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పుచేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే... తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు రాఘవేంద్రరావు చేసిన కీచక పర్వానికి ఓ కుటుంబం బలి కావడమే ఇందుకు నిదర్శనం' అని విజయశాంతి ట్వీట్ చేశారు
----------
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాల గురించి కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆమె అన్నారు. 'ఢిల్లీని ఏలడానికి మీటింగులు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది కానీ, రాష్ట్రంలో రైతు చావులను పట్టించుకోవడానికి సమయం లేదు దొర గారికి. ఇంట గెలువనోడు రచ్చ గెలుస్తాడా? మీరు ఇక్కడి రైతులనే ఆదుకోనప్పుడు, రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్న ఈ రైతు ద్రోహి ప్రభుత్వానికి దేశం పట్టం కడుతుందా?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
---
సంపులో కోట్లాది రూపాయల నోట్ల కట్టలను దాచేసి.. అడ్డంగా దొరికిపోయాడో రాజకీయనాయకుడు. ఆదాయపన్ను శాఖ అధికారులు తడిసిపోయిన ఆ నోట్లను స్వాధీనం చేసుకుని హెయిర్ డ్రయ్యర్లతో ఆరబెట్టి, ఇస్త్రీ చేశారు. మధ్యప్రదేశ్ లోని దామో జిల్లాలో జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంకర్ రాయ్ అనే వ్యాపారి ఇంట్లో లెక్కల్లోకి రాని డబ్బు గురించి సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
---
భారత రాష్ట్రపతిని నిర్ణయించే అంశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ ఓట్లు కీలకం. ఫిబ్రవరి, మార్చిలో జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో మొత్తం 690 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి గెలుపొందే ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. కనుక యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ గతంతో పోలిస్తే బలహీనపడితే అది రాష్ట్రపతి అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనుంది
---------
రమేష్ బాబు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘రమేశ్ బాబు మరణ వార్త విని షాకయ్యాను. ఆయన మరణ వార్త నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. మహేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్నా’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. రమేశ్ బాబు మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వెంకటేశ్ ట్వీట్ చేశారు. మహేశ్ బాబు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
http://www.teluguone.com/news/content/top-news-39-129914.html





