రెక్కీ సంగతేంటీ.. సోముపై సెటైర్లు.. ఓమిక్రాన్ కలకలం... బంపర్ ఆఫర్.. టాప్ న్యూస్@7PM
Publish Date:Dec 29, 2021
Advertisement
వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ జరిగిందని తెలిసిందని, చాలా దురదృష్టమని, దీనిపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వంగవీటి రాధాకృష్ణకు ఏమైనా జరిగితే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్నారు. రెక్కీపై పారదర్శకమైన విచారణ జరిపించాలన్నారు. సీపీఎస్‌ను పక్కదారి పట్టించేందుకే.. తెరపైకి సినిమా సమస్య తీసుకువచ్చారని విమర్శించారు.
-------
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ ఏపీకి ముఖ్యమంత్రా లేక గుజరాత్ కు ముఖ్యమంత్రా? అంటూ నిలదీశారు. అమూల్ కంపెనీ కోసం గుజరాత్ సీఎం కూడా ఇంతగా తాపత్రయపడి ఉండరని నరేంద్ర వ్యాఖ్యానించారు. రూ.150 కోట్లు ఇస్తే ఒంగోలు డెయిరీ తెరుచుకుంటుందని, నష్టాల్లో ఉన్న డెయిరీలకు ప్రభుత్వం ఎందుకు సాయం చేయదని ప్రశ్నించారు
----
టీడీపీ కార్యాలయంలో తయారైన స్క్రిప్టునే సోము వీర్రాజు మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మరీ ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీలకు సొంత అజెండా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గతంలో అమరావతి కుంభకోణాలమయం అన్న బీజేపీ... ఇప్పుడు అధికారం ఇస్తే మూడేళ్లలో అమరావతి రాజధాని పూర్తిచేస్తామని చెబుతోందని మండిపడ్డారు.
-----
మాఫియాలపై ఎమ్మెల్యే ఆనం రామ్‌నారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. తగ్గాల్సింది ఏదైనా ఉందంటే లోకల్ మాఫియాలని చెప్పారు. మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయన్నారు. ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్లు కూడా కలిసి ఉన్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ప్రజల్లో ఉందన్నారు
-------
ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు కువైట్, సౌదీ అరేబియా, అమెరికా, నైజీరియా నుంచి వచ్చినట్టు గుర్తించారు.
---
సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం జరిగింది. సింహాద్రి అప్పన్న ఆలయంలో మాల విసర్జన కార్యక్రమంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈవో సూర్య కళ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా సింహాద్రి అప్పన్న భక్తులు చందన మాల ధరించి నలభై ఒక్క రోజులు దీక్షలు చేపట్టి, మలాలు విసర్జన చేసేటప్పుడు సింహాద్రి అప్పన్న దర్శనం అనంతరం మాల విసర్జన చేస్తారు. కానీ ఈసారి సింహాచలం తొలి పావoచ వద్ద ఏర్పాటు చేయడంతో భక్తులకు అయోమయ పరిస్థితి ఏర్పడింది.
-------
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుకు కరోనా భారీన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది, ఆయన వెంటనే నిమ్స్ కి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా నిర్దారణ అయింది. ఢిల్లీ పర్యటన నుంచి రాగానే ఎర్రబెల్లికి అస్వస్థతకు గురయ్యారు. కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది.
-----
మంత్రి కేటీఆర్‌కు వైస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ది ఖరీదైన మద్యం రాజకీయమన్నారు. బీజేపీది చీప్ లిక్కర్ రాజకీయం అని ట్విటర్లో షర్మిల ఎద్దేవా చేశారు. మద్యం పేరుతో దోచుకోవడమే మీరిద్దరి పని.. మీరంతా రక్తం పీల్చే మద్యం నాయకులు అని షర్మిల ట్విటర్లో దెప్పిపోడిశారు.
-----
చమురు ధరలు పెరుగుదలతో అల్లాడిపోతున్న వాహనదారులకు జార్ఖండ్ ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చారు. లీటరు పెట్రోలుపై ఏకంగా రూ.25 తగ్గిస్తూ ప్రకటన చేశారు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్. ఇది జనవరి 26 నుంచి అమలు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడంలేదని... పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై తీవ్ర భారం పడుతోందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు ఊరట ఇవ్వాలని నిర్ణయించామని సొరెన్ వెల్లడించారు
-------
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సినిమా టికెట్ల అంశంలో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు. ఓ వస్తువు ఉత్పత్తిదారుకే ఎమ్మార్పీ నిర్ణయించే అధికారం ఉంటుందని, కొనాలా? వద్దా? అనేది వినియోగదారుడు నిర్ణయించుకుంటాడని వర్మ వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల రేట్లను నిర్మాతలు నిర్ణయించడంలో తప్పేమీలేదని పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/top-news-39-129304.html





