రాధాకు బాబు ఫోన్.. సోముపై సెటైర్లు.. ఇదేందయా కేసీఆర్.. ఎంపీల ఫైటింగ్.. టాప్ న్యూస్@1PM

Publish Date:Dec 29, 2021

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధాకు ఫోన్ చేసి మాట్లాడారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. గన్‌మ‌న్లు వ‌ద్దంటూ వంగ‌వీటి రాధా చెప్ప‌డం సరికాదని, వ్యక్తిగత భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వంగవీటి రాధాకు టీడీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తుందని తెలిపారు.డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని, నిందితుల‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
-----------
రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం జరిగి ఏడాదవుతున్నా నిందితులను ఎందుకు పట్టుకోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా.. శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు.  వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, జగన్ రెడ్డి హిందూమతం పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు.
------
మద్యంపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత సోమువీర్రాజు సమర్థించుకున్నారు. తాను తక్కువ ధరకే మద్యం అమ్ముతానని చెప్పింది తన ఆడుపడుచుల కోసమే అని తెలిపారు. 250 రూపాయలకు మందు అమ్మి పేదవాడి రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. పేదల బలహీనతలను  వైసీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. మందు రెట్లు తగ్గిస్తా అన్నది... వచ్చే కూలీ డబ్బుల్లో కొంతైనా ఇంట్లో ఇస్తారని మాత్రమే అని చెప్పుకొచ్చారు.
----------
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. నల్ల చొక్కా లతో నాడు పోషకులం, నేడు యాచకులం అంటూ నిరసన తెలిపారు. దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నవరత్నాల్లో మమ్మల్ని కూడా ఒక రత్నం కింద చేర్చి.. దఫ దఫాలుగా, బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. 
-------
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో గంద‌ర‌గోళం ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆనందయ్య వ్యవహారంపై ఇప్ప‌టికే ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆనందయ్యకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేశ్‌ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు అని వచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని ఆయ‌న‌ కోరారు. ఆ మందు పంపిణీ చేసేందుకు ఏయే అనుమతులు తీసుకున్నారో తెల‌పాల‌ని ఆదేశించారు.
----
ఓటీఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా కొంగలవీడు గ్రామ వాలంటీర్ గోళ్ల విష్ణువర్ధన్ రాజీనామా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక రాజీనామా చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఓటిఎస్ పేరుతో ప్రభుత్వం ముక్కుపిండి రూ. 10వేలు వసూలు చేయడం తనకు నచ్చలేదన్నారు. జగనన్నప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు
------
డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని జనాలు మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పైసలే ముఖ్యమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  కేసీఆర్ సర్కార్ పై జనాలు తీవ్రంగా స్పందిస్తున్నారు. 
-------
ట్యాంక్‌బండ్‌పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొనడంతో మూడేళ్ల చిన్నారి శ్రీ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో తల్లి సామాన్య, తండ్రి శివకుమార్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు.
-------
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు అదిష్టానం మద్దతు లభించింది. నాయకత్వ మార్పు ప్రతిపాదనను అధిష్టానం తోసిపుచ్చింది. ప్రస్తుత సభాకాలం పూర్తయ్యే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్  కమిటీ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి  అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. నాయకత్వ మార్పు లేదని ప్రకటించారు. 
----
ప్రజల సమస్యలపై కొట్లాడాల్సిన ఎంపీలు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన జోర్డాన్ లో జరిగింది. సమాన హక్కులపై ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా..  ఓ ప్రతిపక్ష ఎంపీ దానిని పనికిమాలిన బిల్లు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎంపీలు సీట్ల నుంచి లేచొచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. చొక్కాలు పట్టుకుని ముష్టి ఘాతాలు కురిపించుకున్నారు.
---
సినీ హీరో మంచు మ‌నోజ్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలుపుతూ ప‌లు సూచ‌న‌లు చేశాడు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపాడు మంచు మనోజ్. ఇటీవ‌ల తనను క‌లిసిన వారంచా వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.