టాప్ న్యూస్ @ 7PM

Publish Date:Oct 1, 2021

Advertisement

ఏపీలో డ్రగ్స్ ఛాలెంజ్ కాకపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్స్ అక్రమరవాణాపై వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు హైదరాబాద్ రామంతపూర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వచ్చారు. డ్రగ్స్ పరీక్షకు రావాలంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఏపీ టీడీపీ నేతలు సవాల్ విసిరారు. డ్రగ్ టెస్టుకు రాకుండా వైసీపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు.
-----------
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నమోదైన అట్రాసిటీ కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్‌, ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వీవీ సతీష్‌ తెలిపారు. న్యాయవాది సతీష్‌ వాదనలతో కోర్టు ఏకీభవించింది. 
---------
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ లేవనెత్తిన అంశాలకు సీఎం జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమని ఆయన మండిపడ్డారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోందని, బద్వేల్ ఉపఎన్నికలపై రెండు పార్టీ కలిసి ముందుకు వెళ్తాయని మాధవ్ చెప్పారు.
---------
బద్వేల్‌ ఉపఎన్నికలో జనసేన ఎవరితో కలిసినా తమకు నష్టం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానంపై స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు మానుకోవాలని సూచించారు. యాక్షన్ అనగానే చేయడానికి ఇది సినిమా కాదని ఎద్దేవాచేశారు. గోతులు పూడ్చి ఫొటోలుదిగే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని తప్పుబట్టారు
--------
టిడ్కో ఇళ్ల కేటాయింపు అంశం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాన్ని కుదిపేసింది. రెండున్నరేళ్లయినా ఇంకా ఇళ్లు కేటాయించని అంశాన్ని టీడీపీ కార్పొరేటర్లు ప్రస్తావించడం, దీనిపై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బూతులు మాట్లాడటంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 202 అంశాలతో అజెండా ప్రవేశపెట్టారు
--------
ఏపీ రాష్ట్రంలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఇటీవల బూతుల పురాణం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలను ఒలంపిక్స్‌లో బూతు ఆటలు ఆడితే, వైసీపీకి స్వర్ణపథకం, జనసేనకి రజత పథకాలు వస్తాయని తులసిరెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో అల్లాడుతుంటే.. ఈ రెండు పార్టీల నాయకులు పోటీ పడి బూతులు తిట్టుకోవడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు
------
హరితహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరితహారం మరింత సమర్థవంతంగా నిర్వహణకు హరిత నిధి ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. పచ్చదనం పెంపు పట్ల ప్రతీ ఒక్కరు తమ బాధ్యత, పాత్ర పోషించేలా హరిత నిధి ఉపయోగపడుతుంద్ననారు. హరిత నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల జీతాల నుంచి నెలకు రూ. 500, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రతీ నెలా 100 రూపాయల విరాళం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి.
---------
నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడడంతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
-----
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే ఆయన భార్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటియాలా ఎంపీగా ఉన్న ప్రెణీత్ కౌర్‌ కూడా పార్టీ వీడతారా అనే అనే ప్రశ్నలు అనేకం వచ్చాయి. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడనని, పార్టీలోనే కొనసాగుతానని కౌర్ స్పష్టం చేశారు.
-------
టాలీవుడ్ దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు రామలింగయ్య  అల్లుడు, కేంద్రమాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ , యం.పీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.
------

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.