టాప్ న్యూస్ @ 1PM

Publish Date:Sep 29, 2021

Advertisement

జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్‌ రాగానే.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. జనసేన, వైసీపీ మధ్య రచ్చ రగులుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తుండటం కాక రేపుతోంది. 
--------
స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్‌మీట్‌లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం పవన్‌పై దూషణ పర్వంలో భాగంగా జగన్‌పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్‌పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులు జగన్‌పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించి నాలుక్కరుచుకున్నారు నారాయణ స్వామి. 
--------
 రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను నడపాల్సింది బ్యాంకులా లేక రాష్ట్ర ప్రభుత్వమా అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. కేంద్ర పథకాలకు కేంద్ర నిధుల తాకట్టుతో మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కోసం బ్యాంకులను అప్పు అడగడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా డైవర్షన్ చేశారని ఆరోపించారు. ప్రతి కేంద్ర పథకానికి ప్రత్యేక ఖాతా తెరవాల్సినా, కేవలం 5 ఖాతాలతో మేనేజ్ చేయడం సూట్ కేస్ కంపెనీల నిర్వాహణ లాంటిదేనని మండిపడ్డారు.
------
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు అన్నీ పరిశీలిస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. గత ఎన్నికల్లో కాపులు తటస్థంగా ఉన్నారని...కాపులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే దేనికి దారితీస్తాయో చెప్పలేమని తెలిపారు. ఎస్వీబీసీ  చైర్మన్ పృథ్విని బయటకు పంపడం, అవంతిపై హనీ ట్రాప్ చేయడం, సామినేని ఉదయభాను ప్రతిష్ట దెబ్బ తీయడం జరిగిందన్నారు.
-----
తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము  తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు.
-------
విశాఖలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లా  అతలాకుతలం అయిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. ఎయిర్ పోర్ట్‌లోకి నీరు రావడంతో...ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పరిపాలన రాజధానిగా విశాఖ రూపురేఖలు మార్చేస్తామని అన్నారు..ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని జేవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. 
-------
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెరిగిపోతున్న గంజాయి దందాపై తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకప్పుడు పంజాబ్‌లో ఎలాంటి దందా జరిగిందో ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి దందా జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా విజయశాంతి ప్రశ్నించారు.కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి గంజాయి మత్తు నుంచి యువతరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిదన్నారు. 
----
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో గల ఎస్‌బీఐ బ్యాంక్ ముందు దళితుల క్యూ కట్టారు. తమ అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యాయో లేదో అని లబ్దిదారులు తనిఖీలు చేసుకుంటున్నారు. కొందరికి డబ్బులు అకౌంట్‌లో జమ అయినట్లు మెసేజ్‌లు రాగా...మరికొందరికి మెసేజ్ రాకపోవడంతో లబ్ధిదారులు బ్యాంక్‌కు తరలివచ్చారు.
--------
దేశం కోసం కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు వేల సంఖ్యలో ప్రాణాలర్పించారని ఒక్క బీజేపీ నేత కూడా ఈ జాబితాలో లేడని ప్రతిపక్షనేత సిద్దరామయ్య పేర్కొన్నారు. బ్రిటీష్‌ వారికి గతంలో తొత్తులుగా వ్యవహరించి, నేడు కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తున్న బీజేపీ నుంచి దేశభక్తి పాఠాలు నేర్చుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నారు. బీజేపీ నేతల మనిస్థితిని తాను తాలిబాన్లతో పోల్చానని గట్టిగా సమర్థించుకున్నారు. 
---------
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వతేదీ వరకు ఢిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడాన్ని నిషేధించింది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం ఢిల్లీలో వాయికాలుష్యాన్ని నివారించేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం విధించినట్లు సర్కారు తెలిపింది. శీతాకాలంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. 
------
 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.