ఏపీ పరువు గోవిందా.. జగన్ పై ఉద్యోగుల వార్.. శ్రీలక్ష్మికి షాక్.. టాప్ న్యూస్@7PM

Publish Date:Nov 12, 2021

Advertisement

పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని  ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపై అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
----------
దేశంలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ రెడ్‌ నోటీసులను జారీ చేసింది. మెడికల్‌ ఉపకరణాలను ఏపీకి సరఫరా చేయవద్దని  ఐఎండీ ఇండస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీఎంఎస్‌ఐడీసీకి పరికరాలు ఎవరు సరఫరా చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని  సమాఖ్య తెలిపింది. సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేదని సమాఖ్య పేర్కొంది
---------
అదనపు రుణం అర్హతను ఏపీ కోల్పోయింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీ వెనకబడింది. రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో ఏపీ వెనకబడింది. దీంతో అదనపు రుణాన్ని ఏపీ పొందలేకపోయింది.  రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎంకు అదనంగా 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తెలంగాణ రూ.5392 కోట్ల అదనపు రుణం పొందనుంది. 
----------
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శుక్రవారం కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. 
---------
 ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ, కర్నాటక సరిహద్దు వివాదం తేలేంతవరకూ తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తును నిలిపివేయాలని శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కేసు విచారణను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగదీస్తుందంటూ శ్రీలక్ష్మి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీలక్ష్మి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో శ్రీలక్ష్మి పిటిషన్‌ను హైకోర్టు కూడా తోసిపుచ్చింది
---------
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది.విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ వంశీకృష్ణ యాదవ్, వరదు కల్యాణి, తూర్పుగోదావరి స్థానిక కోటాలో అనంత విజయభాస్కర్, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్, గుంటూరు నుంచి మూరుగుడు హనుమంతరావు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, చిత్తూరు స్థానిక కోటాలో కృష్ణ రాఘవ భరత్, అనంతపురం స్థానిక కోటాలో వై.శివరామిరెడ్డి, ప్రకాశం స్థానిక కోటాలో తూమాటి మాధవరావులను ప్రకటించారు.
-----------
బీజేపీ నేత బండి సంజయ్‌ కాదు తొండి సంజయ్ అన్నారు కేటీఆర్. బండి సంజయ్‌ను గెలిపించినోళ్లకి ఓ దండం అన్నారు. ఇలాంటి పిచ్చోళ్లని పార్లమెంట్‌కి పంపించారన్నారు. హిందూ-ముస్లిం పేరుతో ఆగం చేయటమే బీజేపీ పని’’ అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. 
-----------
రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్యర్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు  కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర ఉంటుందని ఏఐసీసీ కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ల పర్మిషన్లు తీసుకొని యాత్రలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు లోబడి ఈ యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు అనుమతులు ఇవ్వకుంటే గాంధీ భవన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. 
----------
దేశ నిర్మాణంలో విధిగా ప్రాణాలు అర్పించిన ఐపిఎస్ అమరవీరుల అత్యున్నత త్యాగం, కీలక పాత్రను స్మరించుకుంటూ ఈ దేశ సేవలో అంకితమైన ఒక జట్టుగా, కుటుంబంగా కలిసి పనిచేయాలని అధికారి ట్రైనీలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోవల్ హాజరయ్యారు. 
-----
 కొవిడ్-19 అనంతరం దేశంలో సైబర్ నేరాల రేటు 500 శాతం పెరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. శుక్రవారం 14వ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా కాలంగా సైబర్ నేరాల పెరుగుదల గురించి అనేక వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి.
 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.