'2014' సినీ సింహాసనం ఎవరిది?
Publish Date:Dec 31, 2013
Advertisement
2013 వెళ్లి ...2014 వచ్చేస్తోంది. ఈ సమయంలో 2013 లో తీపి కబుర్లు అంటే హిట్ కొట్టిన హీరోలు..వారి సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కి సంతోషం పంచుతున్నాయి. నిర్మాతలకు మరెన్ని సినిమాలు ప్రారంభించేలా చేస్తున్నాయి. 2013లో హిట్, ఫ్లాఫ్ ల మాట అటుంచితే మన స్టార్ హీరోలు ఎంటర్ట్నైమెంట్ పంచడానికి పెద్ద గ్యాప్ తీసుకోవడం లేదు....రెట్టించిన ఉత్సాహంతో తర్వాత ప్రాజెక్టులలో బిజీ అవుతున్నారు. ఈ ఏడాది గత ఏడాదికి మించి విజయాలని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి 2014 ఆశించినట్టుగానే సాగుతోందా? 2014 లో ఏ హీరోలకి కలిసి వస్తుందో ఒకసారి విశ్లేషిద్దాం. సూపర్ స్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్: అదే విధంగా గత ఏడాది ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' మల్టీస్టారర్స్ తో వచ్చిన మహేష్ ఈ సారి '1 నేనొక్కడినే' అంటూ తన దూకుడు చూపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్, మహేష్ , సుకుమార్ మొదటిసారి పనిచేస్తున్న చిత్ర౦ కావడం... అలాగే సంక్రాంతి సెంటిమెంట్ మహేష్ బాగా కలిసి వస్తుండడం..ఈ సినిమా పై 'హైప్' ను ఇంకా పెంచుతున్నాయి. మహేష్ బాబు 1 నేనొక్కడినే ఆడియో ఇటీవలే విడుదలై యువతను ఊపేస్తోంది. పవన్ సింహాసనం కొట్టేస్తాడా..!! ఎన్టీఆర్ 'రభస' చేస్తాడా? అల్లు అర్జున్ 'టాప్ గేర్'..!! రవితేజ 'కేర్‌ఫుల్'..!! మళ్ళీ చైతు 'తడాఖా'..! గోపీచంద్ సక్సెస్?
గత ఏడాదిలాగే ఈసారి కూడా సంక్రాంతి రేసులో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పోటీ పడబోతున్నారు. అయితే ఈ సారి సీన్ కొంచెం రివర్స్ అయింది... గత ఏడాది 'నాయక్' అంటూ సింగిల్ గా రంగంలోకి దూకిన చరణ్ ఈ సారి 'ఎవడు' అంటూ మల్టీ స్టారర్ మూవీ తో వస్తున్నాడు.
సాధారణంగా ఇంత ఆలస్యమైన సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉండవు. కానీ ‘ఎవడు’పై అంచనాలు మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. గత సంక్రాంతికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సూపర్ డూపర్ హిట్ కావడం, అగ్రహీరోలకి 7వ చిత్రం బ్లాక్ బస్టర్ కావటం సెంటిమెంట్ పరంగా ‘ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్టుబస్టర్‌లో నెం.1 ఆడియోగా ఉండటం విశేషం.
ఈ రెండు సినిమాల్లో సోకాల్డ్ కమర్షియల్ అంశాలతో పాటు కాసిన్ని నవ్వులు కూడా ఉన్నట్టయితే ఈ సినిమాలు 'యాభై కోట్లు' దాటడం అంత కష్టమేమి కాదని అంటున్నారు విశ్లేషకులు.
2012లో 'గబ్బర్‌సింగ్'తో ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయిన పవన్ కళ్యాణ్...‘అత్తారింటికి దారేది’తో ఏకంగా ఆల్ టైమ్ నంబర్ వన్ హిట్ అందుకున్నాడు. మళ్లీ పవన్ పరాజయాల పరంపర కొనసాగిస్తాడని అనుకున్న వాళ్లు ఎవరైనా ఉంటే ‘అత్తారింటికి దారేది’తో ‘పవన్ ఈజ్ బ్యాక్’ అనేశారు. 2014లో ‘గబ్బర్‌సింగ్ 2’తో హ్యాట్రిక్ కొట్టేసి '1' సింహాసనం తనదేనని అంటాడా?
ఎన్టీఆర్‌కి ఈసారి కూడా టాప్ ఫైవ్ హిట్స్‌లో చోటు దక్కలేదు. భారీ అంచనాలతో విడుదలైన ‘బాద్‌షా’ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది. ఓవరాల్‌గా నలభై అయిదు కోట్లకి పైగా షేర్ వసూలు చేసి ఎన్టీఆర్‌కి తొలిసారి నలభై కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించిపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సంచలనాలని మాత్రం సృష్టించలేదు. కాని 2014లో మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 'రభస' చేస్తానని అంటున్నారు. సంతోష్ శ్రీనివాస్‌తో చేస్తున్న 'రభస'లో ఎన్టీఆర్ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుందని అంటున్నారు.
పూర్ ఫామ్‌లో ఉన్న పూరి జగన్నాథ్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ చేసిన అల్లు అర్జున్ కేవలం ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకున్నాడు. కానీ అల్లు అర్జున్ సినిమాల లైనప్ బాగుంది. సురేందర్‌తో ‘రేసుగుర్రం’ అనే కంప్లీట్ ఎంటర్‌టైనర్ చేస్తున్న బన్నీ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించబోతున్నాడు. కాబట్టి 2014లో అల్లు అర్జున్ జోరు మళ్లీ పెరిగి టాప్ గేర్‌లోకి వెళ్లవచ్చు.
కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూసిన రవితేజ ఎట్టకేలకు ‘బలుపు’ చూపించాడు. ఈ చిత్రంతో రవితేజ ఫ్లాప్ స్ట్రీక్ ఎండ్ అయి, మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇకపై మళ్లీ పట్టు కోల్పోకూడదని రవితేజ ఎప్పుడూ లేనంత కేర్‌ఫుల్‌గా ఉంటున్నాడిప్పుడు. బలుపు రిలీజ్ అయి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు అతని కొత్త సినిమా మొదలు కాలేదు. 'సో' 2014 లో తన జోరును పెంచడానికి కేర్‌ఫుల్ గా అడుగులు వేస్తున్నాడు.
రామ్ 'వేక్ అప్':
గత ఏడాది ‘ఎందుకంటే ప్రేమంట’తో ఫ్లాప్ అయిన రామ్ ఈసారి ‘ఒంగోలు గిత్త’గా కొమ్ములు విరగ్గొట్టుకుని, మసాలాతో పూర్తిగా డీలా పడ్డాడు. ఇంకా తన తదుపరి చిత్రమేది అనేది అతను ఫిక్స్ కాలేదు. రామ్ కి 2013 వేక్`అప్ కాల్. ఇప్పటికీ జాగ్రత్త పడకపోతే... 2014లో ఇబ్బందులు తప్పవు.
నాగచైతన్య ఎట్టకేలకు ‘తడాఖా’ చూపించాడు. ఈ చిత్ర విజయంతో మళ్లీ చైతన్య మునుపటిలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. రాబోయే సినిమాల్లో ఆటోనగర్ సూర్య, మనం ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి '2014' కెరీర్ పరంగా నాగచైతన్యకి చాలా కీలకం.
గోపీచంద్ ‘సాహసం’ సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ అతని కష్టాలు అయితే తొలగిపోలేదు. హీరో అయిన కొత్తల్లో వరుస విజయాలు అందుకున్న గోపీ ఇప్పుడా రోజుల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. వెటరన్ డైరెక్టర్ బి. గోపాల్‌తో చేస్తున్న సినిమా ఎంతవరకు అతని ఎదురు చూపులకి బదులిస్తుందో మరి.
'2014' మన కళ్ళకి పండుగలా సాగాలంటే...మన హీరోలకి సక్సెస్ లు రావాలి...అలా సక్సెస్ లు కావాలంటే వారు కాస్త పంథా మార్చాలి. ఏది ఏమైనా ..ఈ సంవత్సరం అయినా మంచి హిట్ సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడాలని ఆశిద్దా౦.
http://www.teluguone.com/news/content/top-5-heroes-in-tollywood-2013-32-28910.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.