కాజల్‌... మహా... కాస్ట్‌లీ గురూ...

Publish Date:Dec 31, 2013

Advertisement

 

 

 

ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్స్‌ పరంగా నెంబర్‌వన్‌ హీరోయిన్‌ ఎవరు? అని అడిగితే ఠక్కున చెప్పేస్తాం సమంత అని. మరి రెమ్యునరేషన్‌ పరంగా అంటే... తడుముకునే వాళ్లం. అయితే కాజల్‌ పుణ్యమాని మనకా తడుముకునే అవస్థ తప్పింది. ఇప్పటిదాకా తెలుగులో ఏ హీరోయిన్‌ అందుకోనంత రెమ్యునరేషన్‌ అందుకుంటూ కాజల్‌... కొత్త చరిత్రకు ఆజ్యం పోసింది. ఈ క్రేజీగాళ్‌... కమల్‌హాసన్‌తో ‘ఉత్తమ విలన్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఆ సినిమా కోసం ఏకంగా టాప్‌ హీరోతో సమానంగా రూ.2కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుందని సమచారం.

 

అంతేకాదు... రామ్‌చరణ్‌, క్రష్ణవంశీల కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమా కోసం కూడా పెద్ద మొత్తాన్నే డిమాండ్‌ చేసి సాధించుకుందట. చందమామతో తనకు హిట్టొచ్చిందని క్రష్ణవంశీ, మగధీర, నాయక్‌ సినిమాల్లో తన సక్సెస్‌ జోడీ అని రామ్‌చరణ్‌... సెంటిమెంట్‌గా ఫీలవ్వడంతో... ఈ నాజూకు భామ అడిగినంత ముట్టజెప్పారట. ఈ రెండు సినిమాలకూ కాజల్‌ వసూళ్లు చూసిన సినీ జనం... నెంబర్‌వన్‌ అంటే ఇంకొకర్ని ఎలా చెప్పుకుంటాం అని అనుకుంటున్నారట. సినిమాల్లో నటించడంతో పాటు అవసరాన్ని, సెంటిమెంట్‌ను బాగానే మార్కెట్‌ చేసుకుంటున్న ఈ కాస్ట్‌లీ గాళ్‌... తన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే అభిమానుల కోసం ఒక మొబైల్‌ అప్లికేషన్‌ కూడా  ఇటీవలే రిలీజ్‌ చేసింది. అమ్మో... కాజల్‌... అసాధ్యురాలే.

By
en-us Political News

  

హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..

మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?

డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

Publish Date:Dec 24, 2015

ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..

2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.

క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి

2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.

టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్‌ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
 

సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...

Publish Date:Dec 21, 2015

ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..

డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.

త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో

దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.