పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన అనంతరం జరిగిన పరిణామాలతో ఒక్క సారిగా హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివచ్చేస్తుందన్న చర్చ ప్రారంభమైంది. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ పట్ల చిన్న చూపుతో వ్యవహరిస్తున్నదన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భేటీ అయిన తరువాత పరిస్థితిలో ఒకింత మార్పు వచ్చినప్పటికీ.. పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతుందన్న చర్చ మాత్రం ఆగలేదు.
ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ ను తెలుగు సినీ పరిశ్రమకు హబ్ గా మారింది. అలా మారడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివస్తే... ఆయన నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్న భావన అందరిలోనూ నెలకొని ఉంది. అంతే కాకుండా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు, అలాగే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ స్వయంగా చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి. మెగా పవర్ స్టార్ గా ఆయనకు ప్రేక్షకులలో తిరుగులేని ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సిని పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడానికే మొగ్గు చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషించారు.
అయితే పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని చంద్రబాబు కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమపై కూడా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిరావడంపై తాను పెద్దగా దృష్టి పెట్టడం లేదని అన్నారు. అమరావతి నిర్మాణం పూర్తైతే షూటింగుల కోసం వారే ఇక్కడకు వస్తారని ఆయన చెప్పారు.
అయితే రాష్ట్రాలుగా విడిపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రయోజనాలే తనకు ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. అయినా హైదరాబాద్ లో తెలుగు పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను చేసిన కృషి కూడా ఒక కారణమన్న ఆయన తెలుగు సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ పరిశ్రమ అయినా ఒక రాష్ట్రం నుంచి తీసేసి మరో రాష్ట్రానికి తరలించడం అనేది అంత తేలిక కాదన్న చంద్రబాబు నాయుడుఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చాలా కాలం పడుతుందని, వాటిని కల్పించిన తరువాతే పరిశ్రమను ఏపీకి ఆహ్వానించడంపై ఆలోచిస్తాననీ, ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదని విస్పష్టంగా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tollywood-moove-to-ap-not-now-39-190652.html
సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం , ఆమె కుమారుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో కొట్టు మిట్టాడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో వ్యక్తిగత పూచీ కత్తు సమర్పించడానికి ఆయన కోర్టుకు హాజరవుతున్నారు.
సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల కేవలం గృహిణి మాత్రమే . కనీసం స్విమ్మర్ కూడా కాని ఆమె విశాఖ ఆర్ కె బీచ్ నుంచి కాకినాడ తీరం వరకు ఈది సంచలనం సృష్టించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీలో ఉక్కపోతే మిగిలింది. వణికించేస్తున్న చలిలో కూడా ఆయనను ఉక్కపోత వేధిస్తున్నట్లుంది. జనవరి చివరి వారం నుంచి జిల్లాలలో పర్యటిస్తానంటూ ఆయన చేసిన ప్రకటనకు సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన పర్యటనలను వాయిదా వేసుకుని హడావుడిగా విదేశీయానానికి రెడీ అయిపోయారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులలో షెడ్యూల్ వెలువడనుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆప్, బీజేపీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక చాలా వరకూ పూర్తి చేయడమే కాకుండా, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగే మహాకుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. పుష్కారనికి ఒక సారి జరిగే మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచీ 40 కోట్ల మందికి పైగా హాజరౌతారన్న అంచనాలు ఉన్నాయి.
విశ్వ హిందూ రక్ష పరిషత్ ఆద్వర్యంలో మన గుడి-మన బలం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆలయ ఆదరణ,సంరక్షణ ప్రతీ హిందు ఇంటి నుంచే మొదలవ్వాలని పిలుపు నిచ్చారు.
ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ ఫ్యాక్టరీలో శనివారం (జనవరి 4) సంభవించిన భారీ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ యాదగిరిగుట్ట మండలం కందుకూరులో ఉంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రమంలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా వేడుకగా, ఘనంగా నిర్వహించే రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పంగుడగా ప్రకటించింది. తొలి సారిగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథ సప్తమి పండుగను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన భారీ ల్యాండ్ స్కామ్ లో బుల్లితెర నటి, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి బుక్ అయ్యారు. విజయవాడ, ఇబ్రహీం పట్నం కేంద్రంలో ఓ ముఠా 700 కోట్ల రూపాయల భూ దందాకు పాల్పడింది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ కేసులో రీతూ చౌదరి పేరు కూడా ఉంది.
సోషల్ మీడియా చేస్తున్న మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన సర్వత్రా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా కారణంగా పిల్లలు దారి తప్పుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి అది నిజం కూడా చిన్న వయస్సు నుంచే సోషల్ మీడియా ఎడిక్ట్ లుగా మారిపోతున్న పిల్లలు చదువు, ఆటలకు దూరం అవుతున్నారు.
కాలుష్యం పర్యావరణానికి చేస్తున్న హాని ఇంతా అంతా కాదు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్యం.. పశుపక్ష్యాదుల ఉసురు కూడా తీస్తున్నది. ముఖ్యంగా జలాలలోకి పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా విడుదల చేస్తుండటంతో వలస పక్షులు బలి అవుతున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా చిక్కుల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆయనను దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ కు ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా ఏసీబీ శుక్రవారం (జనవరి 3)న నోటీసులు జారీ చేసింది.