ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు.. అనుమానాలకు తావిస్తున్న నిర్ణయం

Publish Date:May 9, 2023

Advertisement

ఔటర్‌ రింగ్‌రోడ్డు అవినీతిపై అధికార బిఆర్‌ఎస్‌ నోరుమెదపడం లేదు. ఏదైనా ఆరోపణలు రాగానే అంతెత్తు ఎగిరిపడే నేతలు అసలు ఈ విషయంపై నోరెత్తడం లేదు.  మున్సిపల్‌ శౄఖ మంత్రికెటిఆర్‌ కూడా మౌనం వహిస్తున్నారు. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు.

ఆ తరువాత బీజేపీ నేతలు దానిని అందుకున్నారు.  అవినీతి జరిగివుంటే.. లేదా నిబంధనలకు విరుద్దంగా లీజ్‌ ఇచ్చివుంటే కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకోవాలి. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ, ఈడీ దర్యాప్తలకు ఆదేశించాలి.  కానీ బీజేపీ మాత్రం వాటి జోలికి వెళ్లకుండా   ఆరోపణలకే పరిమితం అవుతోంది. హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రభుత్వం లీజుకు ఇచ్చే విషయంలో విపరీతమైన వివాదాలు నెలకొంటున్న వేళ నిజాలు నిగ్గు తేలాలి.  విపక్షాల ఆరోపణలకు కేవలం మున్సినల్‌ అడ్మినిస్టేషన్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌   ముక్తసరి ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నిజానికి ఓఆర్‌ఆర్‌ ను 30 ఏళ్ల పాటు పైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న దానికి అధికారపక్షం నుంచి సమాధానం రావడం లేదు. ఓఆర్‌ఆర్‌ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

హెచ్‌ఎండీఏ కు ఓఆర్‌ఆర్‌ పై టోల్స్‌ వసూలు చేయడం ద్వారా రాబోయే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. లీజు ఏ కంపెనీకి టెండరు రావాలో ముందే సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని ఆరోపించారు. పైవేటీకరణకు తాము వ్యతిరేకమంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను ఎందుకు పైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిందని నిలదీస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం లీజు పక్రియ జరగడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఓఆర్‌ఆర్‌ను 30ఏళ్ళ వరకు లీజ్‌కు ఇవ్వాల్సిన అవసరం ఏంటన్న దానికి మంత్రి కెటిఆర్‌ నుంచి సమాధానం రావడంలేదు. ఏప్రిల్‌ నెల సగటు టోల్‌ గేట్స్‌ నుండి వచ్చిన ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలు దాటింది. ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోంది. ముఫ్లై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కానీ పిసిసిచీప్‌ 30వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

మరి అంతలా ఆదాయం వస్తున్న ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ గేట్స్‌ లీజును అప్పనంగా ఓ కంపెనీకి కేవలం 7380 కోట్లకు 30 ఏళ్లపాటు ఎలా కేటాయిస్తారంటూ ఇటీవల ప్రశ్నించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టోల్‌ గేట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ప్రభుత్వమే టోల్‌ గేట్‌ లను నిర్వహిస్తూ బ్యాంకుల నుండి నిధులు తెచ్చి బ్యాంక్ కు వడ్డీ చెల్లించినా మంచి లాభాలు వస్తాయని, అలాండిది ప్రజల సొమ్మును  ఐఆర్‌బి అనే సంస్థకు అప్పగించడం వెనుక ఉన్న గూడుపుఠాణి బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అందులోనూ డిఫాల్టర్‌ గా ఉన్న ఐఆర్‌బి కంపెనీకి తిరిగి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టోల్‌ గేట్‌ నిర్వహణ ఒప్పందం పక్రియ వెంటనే ఆపకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఈ వ్యహారంపై సిబిఐ, ఈడిల కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ టోల్‌ గేట్‌ కుంభకోణంపై పోరాటం చేయనున్నట్లు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. ఔటర్‌ వ్యవహిరంపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇదేనా కేసీఆర్‌ చెప్పే గుణాత్మకమైన మార్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీజుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్‌ కుటుంబం ఆరి తేరిందని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.