సమస్యలపై పోరాటంలో ఐక్యత ఎక్కడ?

Publish Date:May 9, 2023

Advertisement

కర్నాటక ఎన్నికల్లో  విపక్షాలు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా సాగుతున్నారు. విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్న కెసిఆర్‌, బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లెఫ్ట్‌ నేతలు ఎవరూ కూడా ఇక్కడ బిజెపిని ఓడించేందుకు కలసికట్టుగా పోరాడుదామన్న సంకల్పాన్ని ప్రకటించలేదు. అంతుకు ముందు జరిగిన పలు రాష్టాల ఎన్నికల్లోనూ ఇదే తీరు కొనసాగింది. వెూడీ, బీజేపీ  కోరుకుంటున్న విధంగానే విపక్షాలు ఐక్యతకు దూరంగా ఉంటూ ప్రజలకు అదే సంకేతాన్ని యిస్తున్నాయి.

అంతెందుకు ఢిల్లీ కేంద్రంగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా వారికి అండగా నిలిచి పోరాడాలన్న కనీస జ్ఞానం కూడా విపక్షాల్లో లోపించింది. ఈ ఒక్క విషయం చాలు బిజెపిని నిలదీయడానికి కానీ సమస్యలపై పోరాడేందుకు కానీ విపక్షాలకు చిత్తశుద్ధి కొరవడిందని జనం భావించడానికి. ఏదో వెళ్లామా అంటే వెళ్లామన్న తీరులో కొందరు వెళ్లి  రెజ్లర్లకు మద్దతు ప్రకటించారే తప్ప జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌ కీర్తి పతాకను రెపరెపలాడించిన కుస్తీ వీరులకు అండగా ఉద్యమించడంలో మాత్రం పూర్తిగా విస్మరించారు. రెజ్లర్లపై  ఢిల్లీ పోలీసులు అమా నుషంగా ప్రవర్తించారు. జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై లాఠీ ఝుళిపిం చారు. పోలీసులు తప్ప తాగి విర్రవీగారని రెజ్లర్లు ఆరోపిస్తుండగా.. బీజేపీ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిం దంటూ విపక్షాలు దుమ్మెత్తి పోశాయి.  ఢిల్లీ మహిళా కమిషన్‌ కూడా ఈ ఘటనపై సీరియస్‌ అయ్యింది.

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మైనర్‌ సహా.. పలువురు మహిళా రెజ్లర్లు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఏప్రిల్‌ 23 నుంచి వారు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి దిగ్గజ కుస్తీవీరులు, మాజీ రెజ్లర్లు మద్దతు ప్రకటిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నారు. అయినా ఆ బిజెపి ఎంపిపై చర్య తీసుకోవాలని, మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఉమ్మడిగా పోరాడాలన్న చలనం విపక్షాల్లో కానరావడం లేదు. ఈ విషయాన్ని అంతా కలసి మహిళా రాష్ట్రపతి ముందుకు తీసుకుని వెళ్లవచ్చు. నిజానిజాలను విచారించాలని కోరవచ్చు. బిజెపి ఎంపిపై చర్యలకు గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉన్నా.. విపక్ష పార్టీలు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. మహిళా రెజ్లర్లకు అండగా పోరాడాలన్న కనీస నైతికతను కూడా మహిళా ఎంపిలు కనబర్చడం లేదు. ఎందుకంటే వారికి రాజకీయాలను మించిన సమస్య మరోటి లేదు కనుక.

అంతెందుకు..కర్నాటకలో బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని చెబుతున్నా విపక్ష నేతలు  కలసి పని చేయడానికి ముందుకు రాలేదు. కర్నాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎవరికి వారే అన్నట్లుగా పోటీ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు బిజెపికి కలసివచ్చేదిగా ఉంది. అక్కడ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నడుస్తున్నా...కర్నాటకలో నేతలు అవినీతి లో కూరుకుపోయారు. బిజెపి అవినీతిని ఎలుగెత్తాల్సిన పార్టీలు ఉమ్మడి కార్యాచరణ చేయడం లేదు. ఎందుకంటే అవినీతిలో అన్ని పార్టీల నేతలదీ ఒకటే దారి. మరోవైపు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడాన్ని పలు ప్రాంతీయ పార్టీలు అంగీకరించే పరిస్థితిలో లేవు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో రాజీ ధోరణి అవలంబించడానికి సిద్ధంగానే ఉంది. కాంగ్రెస్‌, బీజేపీలకు సమదూరం అంటూ కేసీఆర్‌, మమతా బెనర్జీ, కేజీవ్రాల్‌ వంటివారు ప్రకటిస్తూనే ఉన్నారు.

అయితే రాహుల్‌ గాంధీకి సంఘీభావం తెలపడం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ మూడు పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాలంటే జయప్రకాశ్‌ లాంటి అనుసంధానకర్త కావాలి. అంత నిజాయితీగా ఉండి విపక్షాలను నడిపించే  వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకంటే ఐక్యత కోరుకుంటున్న వారంతా ప్రధాని పదవిని కోరుకుంటున్న వారే. కర్నాకటలో కూడా కుమారస్వామి, సిద్దరామయ్య, డికె శివకుమార్‌ తదితరులంతా సిఎం పదవిపై కన్నేసిన వారే. అందుకే విపక్షాల ఐక్యత అన్నది ఎండమావిగా మారుతోంది. నిజానికి కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదు. ఆ విషయం అన్ని పార్టీలకు తెలుసు. అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌ మద్దతుతో ప్రధాని గద్దెపై ఒక్కసారయినా ఎక్కాలని చూస్తున్నవే. ఇలా చేసే చరణ్‌ సింగ్‌, చంద్రశేఖర్‌, విపిసింగ్‌ లాంటి వారు ప్రధాని పదవిని అధిష్టించినా..దేశాన్ని పాలించే సత్తా లేదని నిరూపిం చుకున్నారు. ఒకవేళ కలిసినట్టు కనిపించినా ప్రస్తుతం వెూడీ నాయక్తంలో ఉన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనే పరిస్థితి కానరావడం లేదు.

కాంగ్రెస్‌ పార్టీ కూడా నిస్వార్థంగా పోరాడాలన్న సంకల్పాన్ని మరింత గట్టిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. గాంధీ నెహ్రూకుటుంబం బయటి వ్యక్తిని పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ ఒక అడుగు వేసింది.  దానిని అందిపుచ్చుకుని బీజేపీయేతర పార్టీలు అడుగు కలపాల్సిన, కదపాల్సిన అవసరం ఉంది. అది జరగనంత వరకూ విపక్షాల ఐక్యత ఎండమావిగానే ఉంటుంది. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.