కాషాయ తీర్థం పుచ్చుకున్న టీఎంసీ ఎంపీలు.!

Publish Date:Jul 9, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  పెను సంచలనం చోటుచేసుకుంది.  ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి  భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు  రాజ్యసభ మాజీ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్,  ప్రకాష్ చిక్ బారాయిక్ లు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు.

గురువారం (జులై 9) వీరు అధికారికంగా బీజేపీ గూటికి చేరారు. గత నెలలోనే వీరంతా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి విదితమే.  వీరరుముగ్గురూ గురువారం జులై 9) బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో   కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా  బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో  ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే  వీరినే  తమ అభ్యర్థులుగా ప్రకటించింది. 

పార్టీ మారిన ఈ ముగ్గురు నేతల్లో సుఖేందు శేఖర్ రాయ్  టీఎంసీలో సీనియర్ నాయకుడు.  2024 ఆగస్టులో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్‌పై జరిగిన   హత్యాచార ఘటనపై అప్పుడే సుఖేందు శేఖర్ రాయ్.. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, పోలీసుల వైఫల్యాలను తప్పుపట్టారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే   తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

దీంతో అప్పటి నుంచీ   టీఎంసీ హై కమాండ్ ఆయనను పూర్తిగా పక్కనబెట్టింది.  ఈ నేపథ్యంలోనే.. సుఖేందు శేఖర్ రాయ్   గత నెల 8న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న సుస్మితా దేవ్,  11న  ప్రకాష్ చిక్ బారాయిక్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు వారు బీజేపీ గూటికి చేరి టీఎంసీకి, మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చారు.  

West Bengal Politics, BJP TMC Shock, Sukhendu Sekhar Ray, Mamata Banerjee, Rajya Sabha By Election Candidates

By
en-us Political News

  
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.