క్రెడిట్ వార్ లో తప్పుటడుగులు.. లోపభూయిష్టంగా వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్.!

Publish Date:Sep 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక వారంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ,  పోలవరం ఎడమ కాలువను ప్రారంభించి, రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మరోవైపు, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.

ఇక పోలవరం ఎడమ కాలువ పనులను చేపట్టింది.. సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగనే అంటూ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ శతధా ప్రయత్నిస్తోంది.  అయితే వైసీపీ ఎకో సిస్టమ్ లో ఒక మాటకు కట్టుబడి ఉండటం అన్నది కనిపించదు. ఈ క్రెడిట్ వార్ లోనూ అదే జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ అమరావతి విషయంలో, మూడు రాజధానుల విషయంలో, అలాగే మావిగన్ అంటూ పూటకో మాట, రోజుకో ప్రతిపాదనా అన్నట్లుగా వ్యవహరించిన తీరుగానే.. వైసీపీ సోషల్ మీడియా కూడా క్రెడిట్ వార్ లో రోజుకో మాట మారుస్తోంది. పోలవరం ఎడమ కాలువ జగన్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తూ పోస్టులు వెల్లువెత్తించిన మరుసటి రోజే మాట మార్చి.. పోలవరం ఎడమ కాలువ పనుల్లో లోపాలున్నాయనీ, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతోందంటూ కొత్త ప్రచారాన్ని తలకెత్తుకుంది. 

ఒకవేళ నిజంగానే పనుల్లో లోపాలు ఉంటే, ఆ లోపాలు జగన్ హయాంలోనే జరిగినవి అని వైసీపీ చెప్పుకుంటున్నట్లే లెక్క.. ఎందుకంటే పోలవరం ఎడమ కాలువ తమ అధినేత క్రెడిటే అని వాదిస్తోంది కనుక.  ప్రాజెక్టు తమదే అని చెప్పుకుంటూనే, అందులో లోపాలు ఉంటే మాత్రం అవి చంద్రబాబు, తెలుగుదేశంల నిర్వాకమేనని సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారం ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


[YCP Social Media  Flawed, YS Jagan, YSR Congress social media strategy, Polavaram Left Canal, Chandrababu Naidu, AP irrigation projects, Telugu One]

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.