డీకే అరుణ ఇంట్లోకి జొరబడిన అగంతకుడి అరెస్టు.. దొంగేనని నిర్థారణ

Publish Date:Mar 19, 2025

Advertisement

జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్56లోని డికె అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతకుడు చొరబడిన సంఘటన సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే.  కిచెన్ వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించాడు. చేతులకు గ్లాజ్లు, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేశాడు. తర్వాత ఎంపి అరుణ బెడ్రూం వరకు వెళ్లి అక్కడ కూడా సీసీ కెమెరా వైర్‌ను కట్ చేశాడు. గంటన్నర పాటు ఇల్లంతా కలియదిరిగాడు. ఆ సమయంలో డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో ఉన్నారు. ఇంట్లో ఆమె కూతురుతో పాటు పని మనుషులు మాత్రమే ఉన్నారు.

ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు.  ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించాడు. దీంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆ దొంగను మంగళవారం (మార్చి 18) అరెస్టు చేశారు. విచారణలో ఆ దొంగ పేరు అక్రమ్ అనీ, ఉత్తరాఖండ్ కు చెందిన అతడు ఢిల్లీలో పలు చోరీలకు పాల్పడి పలుమార్లు అరెస్టయ్యాడనీ తేలింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి తలాబ్ కట్టలో నివాసం ఉంటున్నాడు. ధనికుల ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే అక్రమ్.. నగదు తప్ప బంగారం, ఇతర విలువైన వస్తువల జోలికి వెళ్లడు. ఈ నేపథ్యంలోనే చోరీ కోసం డీకే అరుణ నివాసంలోకి ప్రవేశించిన అక్రమ్ కు అక్కడ నగదు దొరక లేదు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో కలియదిరిగి కూడా ఏమీ చోరీ చేయకుండా వెళ్లిపోవడంతో అసలా అగంతకుడు ఎందుకు వచ్చాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. డీకే అరుణ అయితే భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి నగదు తప్ప ఏమీ దొంగతనం చేయకపోవడం అతని ప్రత్యేకత అని తేలింది.  

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.