చంద్రబాబు దంపతుల హాలీడే ట్రిప్: వైసీపీ దుష్ప్రచారంపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్.!

Publish Date:Sep 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. ఆ పార్టీ ఆరోపణలు, విమర్శలకు ఆధారాలు ఉండాలని భావించదు. ఆ పార్టీ ఎకో సిస్టమ్ (వ్యవస్థ)లోనే ఈ లోపం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటనపై కూడా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది.

 ఏపీ పొలిటికల్ ఎరీనాలో వైసీపీ తీరు ఎప్పుడూ విలక్షణమే. చంద్రబాబు విదేశీ పర్యటనపై  వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో గత రెండు రోజులుగా   ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చంద్రబాబు రహస్యంగా వియత్నాం   పర్యటనకు వెళ్లారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చెప్పాపెట్టకుండా చంద్రబాబు చేపట్టిన ఈ విదేశీ పర్యటన వెనుక భారీ కుట్ర ఉందంటూ క్యాంపెయిన్ ఆరంభించింది.  

వైసీపీ ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ కొట్టి పారేశారు. ఎదుటి వారి  మీద పడి ఏడవడం మాని మీ పని చూసుకోండంటూ సుతిమెత్తగా కాకుండా ఘాటుగా, దీటుగా ఆ దుష్ప్రచారానికి చెక్  పెట్టారు. చంద్రబాబు దంపతులు వారి మనవడితో కలిసి చిన్న హాలీడే ట్రిప్ కు వెళ్లారని లోకేష్ స్పష్టం చేశారు. పనీ పాటా లేని వైసీపీ చంద్రబాబు పర్యటనపై అర్ధంపర్ధం లేని ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ ప్రచారంపై సామాజిక మాధ్యమ వేదికలో స్పందించిన లోకేష్..  సీఎం చంద్రబాబు, భువనేశ్వరి తమ మనుమడు దేవాన్ష్‌తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారనీ, అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కూడా మనుషులేనన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. పొలిటికల్ యాక్టివిటీస్ తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలి కదా. చంద్రబాబు అందుకు మినహాయింపు  ఏమీ లేదు.

అయినా.. స్థానిక ఎన్నికల వేళ విదేశీ పర్యటనకు సిద్ధమైన జగన్ ను వదిలేసి వైసీపీయులు, చంద్రబాబు మనవడిని తీసుకుని భార్యతో హాలీడే ట్రిప్ కు వెళ్లడంపై దుష్ప్రచారం ఏంటని పరిశీలులు విమర్శస్తున్నారు.

అది పక్కన పెడితే..  విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో  ఉత్సాహంగా పాల్గొన్నారు. అయినప్పటికీ, వైసీపీ మాత్రం ఆయన విదేశీ పర్యటనపై పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వారుస్తోంది. 

[Chandrababu Naidu, YCP, AP Politics, Personal Tour, YCP Social Media, Naralokesh, Telugu One]

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.