వాళ్లసలు కాపు నాయకులే కాదు!

Publish Date:Jun 25, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఇటీవల నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశం, సాయికృష్ణ కేసును అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడిన   జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్  వైసీపీ యత్నాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు అసలైన కాపు నాయకులు కారని..  వారు కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బానిసలుగా పనిచేస్తున్నారని   శ్రీనివాస్ విమర్శించారు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని బూతులు తిట్టించినప్పుడు ఈ నేతల ఆత్మగౌరవం ఎటు పోయిందని  ప్రశ్నించారు. జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లను రద్దు చేసినప్పుడు, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలను అణచివేసినప్పుడు నోరు మెదపని వీరు..  ఇప్పుడు హఠాత్తుగా కులప్రేమను ఒలకబోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు. 14 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే పరామర్శించని వైసీపీ నేతలు..  కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలు పెడుతున్నారని ఆరోపించారు.

గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ వైసీపీ నేతలంతా ఘోరంగా ఓడిపోయారని, దీన్ని బట్టే కాపు యువత వీరిని నాయకులుగా అంగీకరించడం లేదనేది స్పష్టమవుతోందని  టట శ్రీనివాస్  పేర్కొన్నారు. చారిత్రకంగా కాపు సామాజిక వర్గం నుంచి ఎందరో మహానుభావులు సమాజానికి సేవలందించారని, కానీ కోడిగుడ్డు ఆమ్లెట్ కథలు చెప్పే అంబటి రాంబాబు, బియ్యం కేసుల్లో ఉన్న పేర్ని నాని వంటి వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకోబోరని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారన్న శ్రీనివాస్  ప్రజాప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొందరు ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని గుర్తుచేశారు. కులాల గోడలు బద్దలు కొట్టి, రాష్ట్ర ప్రగతి కోసం జనరేషన్ జెడ్  ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లడమే కూటమి లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైసీపీ ఆడుతున్న ఈ కుల రాజకీయ డ్రామాలను కాపు సామాజిక వర్గం గమనిస్తోందని, భవిష్యత్తులో వారికి తగిన బుద్ధి చెబుతుందని ముగించారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.