ఈ కేసులు టికెట్ లేకుండా చూపిస్తున్న సినిమాలే.. సీపీఐ నారాయణ

Publish Date:Apr 13, 2026

Advertisement

ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సీపీఐ నారాయణ ఏ విషయం మీదనైనా సరే ఎలాంటి బేషజాలూ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. అటువంటి నారాయణ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులపై నడుస్తున్న కేసులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  
సీపీఐ సీనియర్ నాయకుడు డాక్టర్ కె. నారాయణ  తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తినెయ్యి వినియోగం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి, అక్రమాలు తదితర కేసులలో ఎవరికీ శిక్ష పడే అవకాశం లేదని విస్పష్టంగా చెప్పారు. 
  రెండు రాష్ట్రాల్లోనూ కూడా  ప్రభుత్వాలు మారిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు ముమ్మరమయ్యాయి. ఏపీలో మద్యం కుంభకోణం, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, ఇక తెలంగాణలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ తదితర కేసుల విచారణ సాగుతోంది.   ఈ నేపథ్యంలోనే ఈ కేసులు  ఎక్కడి వరకు వెళ్తాయి? రాజకీయ నాయకులకు శిక్షలు పడతాయా? అన్న తెలుగువన్  ప్రశ్నకు నారాయణ  ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకోవడం తప్ప, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సహకారంతో సాగే ఈ వ్యవహారాల్లో అసలైన దోషులకు శిక్షలు పడటం అసాధ్యమని కుండబద్దలు కొట్టేశారు. 

సివిల్ సర్వెంట్స్ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారన్న నారాయణ, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, రిటైర్మెంట్ తర్వాత కార్పొరేట్ సంస్థల్లో పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.  మీ పదవి ఎక్కడికీ పోదు, జీతం తగ్గదు.. మరి తప్పు చేయమని అడిగినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేకపోతున్నారు?" అని సూటిగా ప్రశ్నించారు.  

ఇకఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు అది చంద్రబాబు అత్యుత్సాహం అని అన్నారు. గతంలో ఆయన అత్యుత్సాహొం వల్లే అమరావతి నిర్మాణంలో సమయం వృధా అయ్యిందన్నారు.   రైతుల దగ్గర భూములు తీసుకోవడం చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమైందని, కానీ వేల ఎకరాల భూమిని ఒకేసారి అభివృద్ధి చేయాలనుకోవడం వల్ల అప్పట్లో జాప్యం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకుండా అభివృద్ధి జరగాలని, కేవలం భవనాలు కడితే సరిపోదని సూచించారు. 

గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తన నెగటివ్ పాలిటిక్స్ ద్వారా చంద్రబాబు గెలుపునకు ఎలా సహకరించారో,   చంద్రబాబు   ప్రజల సమస్యలను విస్మరిస్తే ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురౌతుందన్నారు.   

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత అధికారులపై కక్షసాధింపు చర్యలు అన్నది  ఒక ఆచారంగా మారిందన్న నారాయణ.. ఈ వైఖరి  వ్యవస్థకు చేటు చేస్తుందని హెచ్చరించారు. అమరావతి రాజధానిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధం చేయడం మంచిదే అయినా.. ప్రజల్లో ఉన్న ఇన్సెక్యూరిటీని తొలగించి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జగన్  మావిగన్ ను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు.  

 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.