ఎంపీ సీట్ల పెంపు.. మ‌రో ద‌క్షిణాది పోరాటానికి నాంది?

Publish Date:Apr 14, 2026

Advertisement

ఎంపీ సీట్ల పెంపు విష‌యంలో రేవంత్ రెడ్డి  వాద‌నేంటి?  జీడీపీని బ‌ట్టి మెరిట్ రాష్ట్రాల‌కు సీట్లు ఉండాల‌న‌డంలో అర్ధ‌మేంటి?  టోట‌ల్ గా ఆయ‌న ఎలాంటి రీజ‌న్లు చూపుతున్నారు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో చాలా గట్టి వాదన వినిపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఈ ప్రక్రియ ఉండకూడదనేది ఆయన గట్టిగా చెబుతున్నారు.

జనాభా నియంత్రణ  శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక  కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి.

ఇప్పుడు జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాల‌కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చి, జనాభాను అదుపు చేసిన ద‌క్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అంటే.. బాధ్యతగా ఉన్నందుకు మమ్మల్ని శిక్షించడమే అని వాదిస్తున్నారాయ‌న‌.

ఇక‌ జీడీపీ, మెరిట్ ప్రాతిపదికన సీట్ల విష‌యానికి వ‌స్తే.. కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకూడదని, మెరిట్ అంటే ప్రతిభ చూపే రాష్ట్రాలు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇస్తున్న తోడ్పాటును కూడా పరిగణనలోకి తీసుకోవాలని  ప్రతిపాదిస్తున్నారు రేవంత్ రెడ్డి.

దేశానికి వచ్చే మొత్తం పన్ను ఆదాయంలో సింహభాగం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది.  మ‌రీ ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంట్రిబ్యూష‌న్ ఎక్కువ‌గా ఉంది.

ఈ విష‌యంలో రేవంత్ వాదన ఎలా ఉందంటే..  ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న రాష్ట్రాలకు రాజకీయంగా తక్కువ ఎంపీ సీట్లు ఉంటే, ఆ రాష్ట్రాలు భవిష్యత్తులో నష్టపోతాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మెరిట్ సీట్లు అదనంగా కేటాయించాలని కోరుతున్నారు రేవంత్. అంటే,  మనుషుల సంఖ్యకే కాకుండా, ఆ రాష్ట్రం దేశానికి చేస్తున్న మేలుకు కూడా సీట్లు ఇవ్వాలనేది ఆయన ఉద్దేశ్యం.

ఉత్తరాది రాష్ట్రాలకు 400 పైగా సీట్లు వచ్చి, దక్షిణాదికి కేవలం 100-150 లోపు సీట్లు పరిమితమైతే, దేశ ప్రధానిని లేదా చట్టాలను నిర్ణయించే అధికారం కేవలం ఉత్తరాదికే ఉంటుంది. ఇది దక్షిణాది ఉనికిని దెబ్బతీస్తుంది.

ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి రూ.1 రూపాయి పన్ను కడితే, తిరిగి వచ్చేది 40 పైసలే అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీట్లు కూడా తగ్గితే నిధుల కేటాయింపులో మరింత వివక్ష ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు.

రాజ్యాంగ సవరణ అవసరం అనీ అంటున్నారు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. 1971 జనాభా ప్రాతిపదికనే కాకుండా, రాష్ట్రాల అభివృద్ధి సూచికలను కూడా పరిగణనలోకి తీసుకునేలా నిబంధనలు మార్చాలని ఆయన కోరుతున్నారు.

బాధ్యతగా ఉండి జనాభాను తగ్గించినందుకు మా గొంతు నొక్కకండి అని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ సీట్ల పెంపు అనేది ఒక రాజకీయ క్రీడలా కాకుండా, అన్ని రాష్ట్రాల హక్కులను కాపాడేలా ఉండాలఅంటున్నారాయన. దీనిపై ఆయన ఇతర దక్షిణాది ముఖ్యమంత్రులతో కలిసి ఒక ఉమ్మడి పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు.

ఇప్ప‌టికే ద‌క్షిణాది రాష్ట్రాలు.. అత్య‌ధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నా.. వీరి  నుంచి ఆదాయం ఏమో అర‌వై శాతం పొంది.. హ‌క్కులేమో.. న‌ల‌భై శాతానికి కుదించ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య కాబ‌ట్టి.. ఇది పార్టీల‌కు అతీత‌మైన పోరాటం. ఈ పోరాటంలో.. ప్ర‌తి ఒక్క ద‌క్షిణాది  రాష్ట్రం ముందుకు రావాల‌ని కోరుతున్నారు టీసీఎం రేవంత్ రెడ్డి.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.