వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు

Publish Date:Oct 11, 2024

Advertisement

జాఫర్ భయ్  తన చెల్లెలు అప్సర్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.  కాని చేతిలో చిల్లి గవ్వలేదు. సమస్య పరిష్కారానికి మౌలానా దగ్గరికి వస్తాడు జాఫర్ భాయ్. 


జాఫర్ భాయ్: సలాంవాలేకూం మౌలానా సాబ్ 
మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్ కైరియత్ , కైసే హై ఆప్ 
జాఫర్ భాయ్: అలమ్ దు లిల్లా జీ మౌలానా సాబ్ . మేరీ బెహన్ కా షాదీ కర్నా హై . జెహేజ్ కా ఇంతెజామ్ నై వుహా . సొల్యూషన్ బతాయియే 
 మౌలానా: ఇస్లాంలో నిఖా( పెళ్లి) అత్యంత సులభతరం . ఖర్చులు వీలయినంతగా  తగ్గించాలి. ఈ మధ్యకాలంలో నిఖాలు అత్యంత విలాసవంతంగా జరుగుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చావు దగ్గరవుతుంది. వయసులో ఉన్నప్పుడే నిఖా  చేయాలి.అపుడు  యుక్త వయసులో ఉన్నప్పుడే  వారి పిల్లలు పెద్దవారు అవుతారు.  ప్రయోజకులు అవుతారు.   పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు చేయకండి.  డబ్బులేనప్పుడు తమ తాహతును బట్టీ   నిఖా  చేసేయండి. ఖర్చు తగ్గుతుంది. షరియత్ లో గోరింటాకు వేడుకలు అట్టహాసంగా జరుపుకోవడం నిషిద్దం .  నిఖాను సులభతరం చేయాలి.  ఇస్లాం ప్రకారం బరాత్ కు  చోటే లేదు. వరకట్నం ఇవ్వాలన్న నియమం ఇస్లాంలో లేదు.  పెళ్లికి ఆరు నెలల ముందే సంబరాలు ప్రారంభిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.ఇవి కూడా నిషేధం. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడే వలీమా(డిన్నర్) ఘనంగా చేసుకోవచ్చు. నేను వెయ్యి రూపాయల మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే కెపాసిటీ ఉంటుంది.  కాని అవతలి వ్యక్తి లక్ష రూపాయల మొబైల్ ఫోన్ కొన్నాడని మనం కొనాల్సిన అవసరం లేదు. వ్యక్తుల స్థితి గతులను బట్టీ పెళ్లిళ్లు చేయాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది మరి.  పెళ్లిళ్లు చేయాలి కానీ   మెహర్ (వరకట్నం) అమ్మాయి తరపున తండ్రి ప్రకటించాల్సి ఉంటుంది. తండ్రి లేనప్పుడు బాబాయ్, మామయ్య మెహర్ ప్రకటించాల్సి ఉంటుంది. అబ్బాయి వాళ్లు మెహర్ అడుగుతారు. అప్పుడు అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి తరపున వారితో సామరస్యంగా చర్చించుకోవాలి. ఇస్లాంలో అమ్మాయి తండ్రి వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు. అమ్మాయికి  కనీస అవసర వస్తువులు ఇవ్వొచ్చు. బైక్, ఎయిర్ కూలర్, మంచం, ఆల్మారా వంటివి అబ్బాయి తరపున వాళ్లు అడగొచ్చు. అయితే అమ్మాయి తరపు వాళ్లు ఇష్టంగా ఒప్పుకుంటే మాత్రమే. బలవంతంగా వసూలు చేయకూడదు అంటూ మౌలానా జాఫర్ బయ్ కు  వివరించాడు. 

- బదనపల్లి శ్రీనివాసాచారి 

By
en-us Political News

  
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.