ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు ఎప్పుడు అందుతాయనే అంశంపై అయోమయం నెలకొంది. ప్రతి నెలా ఠంచన్ గా ఒకటో తారీఖునే ఉద్యోగుల జీతాలు వారి వారి ఖాతాల్లో వేయాల్సి ఉంది. అయితే.. మే నెల మూడో తేదీ వచ్చినా వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడని పరిస్థితి నెలకొంది. జగన్ రెడ్డి సర్కార్ తీరు కారణంగా ఉద్యోగులకు జీతాలు ఏ తేదీ లోగా అందుతాయో అనే స్పష్టత లేకపోయింది. రాష్ట్రానికి ఏదైనా పెద్ద మొత్తంలో అప్పు దొరికితే.. ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వాస్తవానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మహా ప్రభో..! అని ఏపీ ఓటర్లను వేడుకున్న జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తీరా చేతికి పవర్ వచ్చాక రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆర్థికంగా దివాళా తీయించారనే ఆరోపణలు ప్రతిపక్షం నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరా ఉండదు.. పరిశ్రమలకు పవర్ హాలిడేస్.. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ కూ కోతల మీద కోతలు.. బొగ్గు నిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం.. గ్రిడ్ నుంచి కూడా అందని విద్యుత్ సరఫరా.. కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్తితి లేదు.. ఏపీలో రోడ్ల దుస్థితి వర్ణనాతీతం. ఏపీలో మౌలిక వసతులు లేని కారణంగా కొత్తగా పెట్టుబడులు వచ్చే దారి లేదు. వచ్చిన కొద్దిపాటి పారిశ్రామిక వేత్తలు వైసీపీ నేతల ధాటికి తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న దుస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఏపీలో ఉత్పత్తి ఎక్కడ అవుతుంది..? ఆదాయం ఎలా వస్తుంది..?
ఈ నేపథ్యంలో అప్పులు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వండి దేవుడో..! అంటూ కేంద్రం వద్ద ఏపీ రాష్ట్ర అధికారులు పడిగాపులు కాస్తున్నారట. అయితే.. ఏపీ అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంటోందట. ఇప్పట్లో కేంద్రం నుంచి రుణ అనుమతులు లభించే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలే చెబుతుండడం గమనార్హం. అప్పులు దొరికితేనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వావల్సిన దుస్థితి నెలకొందంటున్నారు.
‘సొమ్ములు పోనాయ్.. ఏటిసెత్తాం’ అన్న చందంగా వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా ఏపీలో నిధుల కొరత తన్నుకొచ్చిందంటున్నారు. ‘అయినవారికి ఆకులో.. కానివారికి కంచంలో పెట్టినట్లు’ ఏ అవసరానికి ఎంత ఖర్చు చేయాలి? ఏ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఏ స్కీమ్ కు ఎంత ఖర్చు పెట్టాలి? సంక్షేమానికి ఏ మేరకు నిధులు వెచ్చించాలి? అభివృద్ధికి ఎంత పెట్టుబడి పెట్టాలనే వాటిపైన సరైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో నిధుల్ని వృథా చేయడం వల్ల, ప్రభుత్వ పెద్దల అవినీతి వల్ల రాష్ట్ర ఖజానా ఖళీ అయిపోయిందంటున్నారు.
ఏతావాతా విశ్వసనీయంగా బయటకు వస్తున్న విషయం ఏంటంటే.. ఖనాజాకు వచ్చిన నిధులను వచ్చినట్లే ఉద్యోగుల జీతాల కోసం ఇవ్వాలని జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయించిందని సమాచారం. దీంతో ఏప్రిల్ నెల జీతాలు విడతల వారీగా మాత్రమే అందుతాయని.. అది కూడా ఎప్పుడు ఎవరికి జీతాలు వస్తాయో అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం, ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/there-is-an-uncertainty-on-ap-government-employees-salaries-25-135378.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.