కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు కోరిన ప్రశాంత్ కిశోర్.. ఏ విషయంలోనో తెలుసా?

Publish Date:Jul 6, 2026

Advertisement

ఎన్నికల వ్యూహకర్తగా ఇండియన్ పోలిటికల్ ఫీల్డ్ లో  ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనున్నారు. సొంతంగా జన్ సూరజ్ పార్టీ  స్థాపించి ఇటీవలి బీహార్ ఎన్నికలలో ఘోరంగా విఫలమైన ప్రశాంత్ కిశోర్.. ఆ ఎన్నికలలో  తాను బరిలోకి దిగలేదు కానీ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.  తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో  ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా    ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. 

 బీహార్‌లోని అ ప్రతిష్టాత్మక బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికలో తాను బరిలోకి దిగి పోటీ చేయనున్నట్లు ప్రశాంత్ కిశోర్ స్వయంగా చెప్పారు.  పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.  బంకీపూర్..   2006  నుండి ఈ స్థానం నుంచి బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి   బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ విజయం సాధించారు. అయితే  ఆ తరువాత  అంటే ఈ ఏడాది ఏప్రిల్ లో  రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది.  రెండు దశాబ్దాలుగా బీజేపీకి   కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ నిర్ణయించుకున్నారు.  

కాగా తన పోటీ విషయాన్ని ప్రకటించిన మీడియా సమావేశంలోనే.. ప్రశాంత్ కిశోర్ ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ కు రెఫరెండంగా అభివర్ణించారు. మార్పు కోరుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అంతే కాకుండా.. ఈ ఉప ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలను సైతం ప్రశాంత్ కిశోర్ కోరారు.

అవపకమైతే అధికార బీజేపీని తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతానని ప్రశాంత్ కిశోర్ అన్నారు.  అయితే బంకీపూర్ స్థానం నుంచి బరిలోకి దిగుతామని ఆర్జేడీ ఇప్పటికే ప్రకటించింది. ఇక బీజేపీ సొంత స్థానం అయిన బకీంపూర్ ను ప్రశాంత్ కిశోర్ కు మద్దతు ఇచ్చి వదులుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఈ పరిస్థితుల్లోబంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ ఏ మేరకు రాణిస్తారన్న విషయంపై రాజకీయవర్గాలు పెదవి విరుస్తున్నాయి.  

Bankipur by election, Jan Suraaj Party, Bihar politics, Nitin Nabin

By
en-us Political News

  
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.