మండే సూర్యుడు నెల్సన్ మండేలా!

Publish Date:Jul 19, 2022

Advertisement

నెల్సన్ మండేలా నల్లజాతి సూర్యుడిగా తెలుగువారు పిలుచుకునే ఈ వ్యక్తిత్వం మండే సూర్యుడిలాంటిది. దక్షిణాఫ్రికా రాజకీయ చరిత్రలో పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల అంగీకారంతో అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తొలి నల్లజాతి వ్యక్తి నెల్సన్ మండేలా. నల్లజాతీయుల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మండేలా జన్మదినోత్సవాన్ని నెల్సన్ మండేలా డే గా ప్రపంచ వ్యాప్తంగా జులై 18న జరుపుకుంటారు.

నోబెల్ బహుమతి గ్రహీతగా, భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం భారతరత్న గ్రహీతగా మండేలా కేవలం దక్షిణాఫ్రికాకే కాదు మొత్తం ప్రపంచదేశాలకు ప్రేరణగా నిలిచే గొప్ప వ్యక్తి, నాయకుడు, ప్రజలను నడిపించే శక్తి. ఈయన జీవితం ఎన్నో మలుపులతో ఎన్నో పోరాటాలతో నిండి ఉంది. మహాత్మ గాంధీ ప్రేరణగా మండేలా అహింసాయుత మార్గం వైపు ప్రపంచ శాంతి వైపు తనవంతు కృషి చేసారు.

బాల్యం విద్యాభ్యాసం!

ఈయన తెంబు వంశానికి చెందినవాడు. దక్షిణ ఆఫ్రికాలో కేప్ ప్రాంతాల్లో ఉండేవారు. అక్కడి పాలన వీరిచేతుల్లో  ఉండేది. మండేలా 1918 జులై 18న తన తండ్రి మూడవ భార్యకు జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రోలిహ్లాహ్లా. ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈయన పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టాడు. పాఠశాల ఉపాద్యాయుడికి రోలిహ్లాహ్లా అనే పేరు పలకడం రాక ప్రసిద్ధులైన బ్రిటిష్ నావికాదళ నాయకుడు హోరేషియా నెల్సన్ పేరు నుండి నెల్సన్ ను ఈయనకు తగిలించాడు. ఈయనకు 9 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. తరువాత ఈయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ 1937లో "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌టౌన్" కళాశాలలో చేరాడు.

ఈయనకు బాక్సింగ్, రన్నింగ్ మీద చాలా ఆసక్తి ఉండేది. అది కాస్తా వాటిలో ఆయనకు ప్రతిభ తెచ్చిపెట్టింది. కానీ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల వల్ల అవన్నీ అటకెక్కాయి.

మెట్రిక్యులేషన్ తరువాత ఈయన బి.ఏ లో చేరాడు. అయితే ఒక సంవత్సరం తరువాత ఈయన రాజకీయాలలో పాల్గొన్న కారణంగా ఈయనను విశ్వవిద్యాలయం నుండి తీసేసారు.

తరువాత పెళ్లి గోల తపించుకోవడానికి జొహెన్నెస్ బర్గ్ కు వెళ్ళిపోయాడు. అక్కడ చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. దూరవిద్య ద్వారా ఆగిపోయిన బి.ఏ పూర్తి చేశాడు.  తరువాత విల్ వాటర్స్ రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదవసాగాడు. అక్కడే అనూహ్యమైన మార్పులు జరిగాయి. జాతివివక్షత, దానికి వ్యతిరేక పోరాటం చేసేవారు అక్కడే మండేలా కు పరిచయం అయ్యారు.

రాజకీయ అనుబంధం!

రాజకీయంతో అనుభంధాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మండేలా జీవితంలో పొరటాలే. 1948లో ఆఫ్రికనెర్ లు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా నేషనలిష్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక నల్లజాతి తెల్లజాతి అంటూ ప్రజలను వర్గాలుగా విడదీయడం చేసింది. మండేలా పీపుల్స్ కాంగ్రెస్ కార్యక్రమాలలో భాగంగా తన స్నేహితుడితో కలసి స్థాపించిన లా సంస్థ ద్వారా ఎంతోమంది పేద నల్లజాతి వారికి ఉచిత న్యాయవాద సౌకర్యం కల్పించారు. 

ఈయన మొదట గాంధిలా శాంతియుతంగా పోరాటం చేసిన అవేవి నాటి దక్షిణ ఆఫ్రికా పరిస్థితులను మార్చేలా కనబడక అసహనానికి లోనయ్యారు. 1961లో సాయుధ విభాగాన్ని ఏర్పరిచి ప్రభుత్వ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. జాతి వివక్షత అంతం చేయడానికి గెరిల్లా పోరాటాలను కూడా సిద్ధం చేసుకున్నారు. దీనివల్ల చాలామంది మరణించారు.

జైలు శిక్ష!

మండేలా 1962 ఆగష్టు లో అరెస్టయ్యాడు, 1962 అక్టోబర్ లో అయిదు సంవత్సరాల జైలుశిక్ష వేశారు. తరువాత 1964లో న్యాయస్థానం ఎదుట హాజరైనప్పుడు ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించాడు ఆ సందర్భంలో. 

°నా జీవితమంతా ఆఫ్రికన్ జనుల సంఘర్షణకే అంకితం. తెల్లవారి పెత్తనాన్నీ, నల్లవారి పెత్తనాన్నీ నేను ప్రతిఘటించాను. అందరూ సహృద్భావంతో కలిసి ఉండే, అందరికీ సమానావకాశాలు లభించే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా సమాజం నాకత్యంత ప్రియమైన లక్ష్యాలు. అందుకోసమే నేను జీవిస్తాను. అవసరమైతే అందుకోసం మరణించడానికి కూడా నేను సంసిద్ధుడను" అని చెప్పాడు. 

దీని తరువాత ఆయనకు జీవితకాల శిక్ష విధించారు. తరువాత 27 సంవత్సరాల జైలు జీవితంలో 18 సంవత్సరాలు రొబెన్ దీవిలో గడిపాడు. ఈయనకు తక్కువస్థాయి ఖైదీగా చాలా తక్కువ వసతులు కల్పించారు. సున్నపు క్వారీలో పనిచేయించేవారు. అలా అన్నేళ్ళు జైలు జీవితం గడిపిన తరువాత 1990లో మండేలాను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీచేశారు.

స్వీయ చరిత్ర!

మండేలా "లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్" అని స్వీయ చరిత్ర రాసాడు. అది 1994లో ప్రచురించబడింది. అదంతా ఆయన తన జైలు శిక్ష సమయంలో రహస్యంగా రాసాడు.

అధ్యక్షుడిగా!

1994 సంవత్సరంలో మొట్టమొదటి నల్లజాతి వ్యక్తి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా  ఎన్నిక కాబడ్డారు. 1999 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత థాబో ఎంబెకీ  పదవిని స్వీకరించాడు.


చివరి పదేళ్లు!

జూలై 2001లో మండేలాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించబడింది. రేడియేషన్ వైద్యం చేశారు.  జూన్ 2004లో తాను పబ్లిక్ జీవితం నుండి విరమిస్తున్నట్లుగాను, అధికంగా కుటుంబంతో గడపదలచుకొన్నట్లుగాను  ప్రకటించాడు. కాని పూర్తిగా సమాజం నుండి దూరంగా ఉండలేదు.

ఈయన తన చివరి కాలంలో శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జొహెన్నస్ బర్గ్ లో మరణించాడు.

అలా 20 వ శతాబ్దానికి చెందిన గొప్ప పోరాట నాయకుల్లో ఒకరైన నెల్సన్ మండేలా అస్తమయం చెందాడు. కానీ ఆయన పోరాట పటిమ, ఆయన జీవితం మండే సూర్యుడిలా ఎంతోమందిని ప్రేరేపిస్తూ ఉంటుంది.

◆ వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.