ప్రతి తల్లిదండ్రి చేయాల్సిన పని.. బడికి వెళ్లే పిల్లలను ఈ ప్రశ్నలు తప్పనిసరిగా అడగాలి!

Publish Date:Jul 9, 2026

Advertisement

వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే..

ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు..

నచ్చిన విషయం..

ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది.

ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి..

పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది.

ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి..

కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.

ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి..

పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.

                         *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.