హిట్ మ్యాన్ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్.!?

Publish Date:Jul 17, 2026

Advertisement

ఇండియన్  క్రికెట్ హిస్టరీలో తనదైన ముద్ర వేసిన స్టార్ ఓపెనర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ  ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిందా? ఇప్పటికే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే లకు కూడా దూరం కానున్నాడా.. అంటే బీసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఔననే అనాల్సి వస్తోంది.  గత కొంతకాలంగా   ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్ కు ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీసే చివరి సిరీసా అన్న చర్చ జోరుగా నడుస్తోంది.  

ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన పట్ల అతడి అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇంగ్లాండ్ తో గురువారం (జులై 16)  జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్   47 బంతులు ఎదుర్కొని 26 పరుగులు మాత్రమే చేసి ఔటైన తీరుతో అతడి క్రికెట్ కెరీర్ ఫ్యూచర్ పై అందరిలోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డే మ్యాచ్ అతని కెరీర్ లో చివరి మ్యాచ్ కానుందన్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.  

 పీటీఐ వెల్లడించిన కథనం ప్రకారం, రోహిత్ స్థానంపై బీసీసీఐ,  సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ కెరీర్ విషయంలో ఇప్పటికే చర్చలు జరిపారు.   2027 వన్డే వరల్డ్ కప్ ను  దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే  జట్టులోకి యువతను తీసుకోవాలని యోచిస్తున్నారు.    39 ఏళ్ల  రోహిత్ శర్మ స్థానంలో, ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు   అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. . 2027 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా దాదాపు 20   వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడనుంది.   ఈ కీలకమైన మ్యాచ్‌లలో జైస్వాల్‌కు ఓపెనర్‌గా పూర్తి స్థాయి అవకాశం కల్పిస్తేనే  వరల్డ్ కప్ కు ప్లస్ అవుతుందన్నది సెలక్టర్లు, బీసీసీఐ యోచన చేస్తున్నట్లు పీటీఐ కథనం పేర్కొంది.  

రోహిత్ కు సెప్టెంబర్ నెలలో విండీస్ తో జరిగే వన్డే సిరీస్ లో స్థానం అనుమానమేనని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.   ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు పరిశీలనలో లేదన్న విషయాన్ని ఇప్పటికే సెలక్టర్లు అతనికి తెలిపారని విశ్వసనీయ సమాచారం.   మరో వైపు విరాట్ కోహ్లీ తన  ఫామ్, అత్యుత్తమ ఫిట్‌నెస్ కారణంగా జట్టులో కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.  

Rohit Sharma,  ODI Retirement, India vs England ODI, Yashasvi Jaiswal

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.