ఖమ్మంజిల్లాలో  యువకుడి అదృశ్యం... సంచలనం సృష్టించిన  వాయిస్ మెసేజ్ 

Publish Date:Jan 15, 2025

Advertisement

ఖమ్మం జిల్లాలో  ఓ యువకుడి కిడ్నాప్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ఈ వార్త కలకలం రేపింది. సంక్రాంతి సందర్బంగా ఖమ్మం పోలేపల్లికి చెందిన సాయి హైద్రాబాద్ నుంచి   ఖమ్మం బస్టాండ్ కు చేరుకున్నాడు     ఈ  క్రమంలో సాయి తమ్ముడు  సంజయ్ ఖమ్మం బస్టాండ్  వద్ద  అదృశ్యమయ్యాడు.  అన్నను రిసీవ్ చేసుకోవాలని ఖమ్మం బస్టాండ్ కు వచ్చిన సంజయ్  నాటకీయ పరిణామాలతో అదృశ్యమయ్యాడు. అన్న బస్టాండ్ లో ఉండగానే తమ్ముడు సంజయ్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. అన్నయ్య నాకు ప్రాణహాని ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక అమ్మాయిని హత్య చేశారు. నన్ను కూడా హత్య చేస్తారు అని ఆ వాయిస్ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ ను అన్న సాయి కుటుంబసభ్యులకు ఫార్వర్డ్ చేశాడు. నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సంజయ్ బైక్ అక్కడే కనిపించింది కానీ సంజయ్ మాత్రం కనిపించలేదు. సంజయ్ మెసేజ్ లో చెప్పిన అమ్మాయి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీటీవీలో సంజయ్ కనిపించాడు కానీ సంజయ్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. 

By
en-us Political News

  
మహబూబ్ నగర్ జిల్లా లో ప్రముఖ వర్తక కేంద్రమైన జడ్చర్ల రంగనాయక స్వామి గుట్టపై గల కాకతీయుల కాలుపు శిల్పాలపై రంగులు తొలగించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక శిల్పాలు, శాసనాలు, స్థలాలు, కట్టడాలను గుర్తించి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించే "ప్రిసర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ" కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం నాడు రంగనాయక గుట్టపై విస్తృతంగా అధ్యయనం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఈనెల 31న అత్యవసరంగా సమావేశం కానుంది. తిరుమలలో మినీబ్రహ్మోత్సవంగా చెప్పబడే రథసప్తమి ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ జేఏసీ తెలంగాణ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ కు సమ్మె నోటీసు ఇచ్చింది. బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు.
ఈ నెల 29 100వ రాకెట్ ప్రయోగించడానికి ఇస్రో సిద్దమైంది. ఈ సంత్సరం తొలి రాకెట్ కాకావడంతో   నెల్లూరు జిల్లా శ్రీహరికోట ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.
యువగళం పాదయాత్ర తనను ఎంతో మార్చిందనీ, ప్రజా నాయకుడిగా తనను తాను ట్రాన్స్ ఫార్మ్ చేసుకునే విషయంలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే కంటే పాదయాత్రే ఎక్కవ దోహదం చేసిందనీ అన్నారు. రాజకీయాలలో పాదయాత్ర ఎంబీయే లాంటిదన్నారు
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏ విధంగా చూసినా ఒక ప్రత్యేక నేత. ఆయన ఉన్నది ఉన్నట్లు చెబుతారు. ఎలాంటి శషబిషలూ ఉండవు. ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఆయన అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అరహరం ఆలోచించే నారా లోకేష్ సోమవారం (జనవరి 27) విశాఖ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు అయిన నారా దేవాన్ష్ పై జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. పిన్న వయస్సులోనే అతి స్వల్ప వ్యవధిలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసిన నారా దేవాన్ష్ భవిష్యత్ లో గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదుగుతాడని ఎక్స్ లో పోస్టు చేశారు.
సూర్యపేట జిల్లా లో పరువు హత్య  జరిగింది. మామిళ్ళ గడ్డకు చెందిన కృష్ణ ఆరునెలలక్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఒకే రోజు ఊరట, చేదు అనుభవం ఎదురైంది. జగన్ కేసుల విచారణకు వేరే రాష్ట్రానికి తరలించాలనీ, అలాగే జగన్ బెయిలు రద్దు చేయాలనీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లకు సంబంధించి సోమవారం (జనవరి 27) సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రమిశ్రాలతో కూడిన ధర్మాసం విచారించింది.
 జయ శంకర్ భూ పాలపల్లి  జిల్లా  మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం  టెంపుల్ ఇన్ చార్జి మారుతీపై  ఈ వో పై బదిలీవేటుపడింది. సింగర్ మధు ప్రియ గర్బగుడిలో డాన్స్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న పిటిషన్ ను తోసి పుచ్చింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పిటిషనరే స్వయంగా దానిని ఉపసంహరించుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సినీ నేపథ్యం ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని హీరో. అశేష ప్రేక్షకాభిమానం ఆయన సొంతం. జనసేన క్యాడర్ లో అత్యధికులు కూడా సినీ అభిమానులగా మొదలై.. జనసైనికులుగా మారిన వారే. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఎదురౌతున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే.. అత్యధిక జనసైనికులకు పొలిటికల్ కంపల్షన్ విషయంలో పట్టింపు ఉందడు. అలాగే పొత్త ధర్మం గురించి ఆలోచించి, అర్ధం చేసుకునేంత రాజకీయ పరిజ్ణానం కూడా ఉండదు.
తెలంగాణలోస్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయయి పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాలకవర్గాల పదవీ కాలం ఆదివారం (జనవరి 26)తో ముగిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.