జీహెచ్ఎంసీ.. దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్

Publish Date:Dec 26, 2025

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలనలో  తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. ఈ మార్పుల మేరకు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య ప్రస్తుతమున్న వాటికి రెట్టింపైంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)  లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  

దీంతో  2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైదరాబాద్ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. డీలిమిటేషన్ లో భాగంగా   నగరంలో  జోన్లు , సర్కిళ్ల సంఖ్యను కూడా ప్రభుత్వం  పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచింది. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటయ్యాయి.  45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు, ప్రతి జోన్‌లో ఐదు సర్కిళ్లు ఉండేలా  అవసరమైన చర్యలు తీసుకుంది.

 ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు, రాజకీయ పార్టీల నుండి దాదాపు ఆరు వేల అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న అనంతరం తుది నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇక పోతే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిదే. ఈ లోపే వార్డుల పునర్విభజన , ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  

By
en-us Political News

  
పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమాను వీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.
ఇటీవ‌ల కేంద్ర విమాన‌యాన మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో ఫోటోలు దిగారు శంఖ్ ఎయిర్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్ర‌వ‌ణ్ కుమార్.
మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
సాహితీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ భారీ రియల్ ఎస్టేట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నప్పుడే తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
నదీజలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు
ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి.
వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ సమ్మెకు పిలుపు నిచ్చింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో మంటలు ఇంక అదుపులోకి రాలేదు.
నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని నిర్మించడంలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఆల్లర్ల కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా బంగ్లాదేశ్ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది.
తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోందని తెలంగాణ పోలీసులు స్పష్టంగా ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.